తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఇటీవల వరదలతో.. వర్షాలతో అతలాకుతలమైన వరద బాధితుల సహాయర్ధం తమ పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే.. ఎంపీ.. కార్పోరేషన్ చైర్మన్లకు సంబంధించిన రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున వరద బాధితులకు ప్రతి ఇంటికి పదివేలు ఇవ్వాలి.. ఇండ్లను కోల్పోయిన […]Read More
Tags :telangana congress
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు.. ఈ క్రమంలో తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు.తమ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవని దీంతో జ్వరాలు వస్తున్నాయి. ప్రభుత్వం కానీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మహిళలు నిలదీశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..Read More
కరెంట్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ రైతులు స్థానిక సబ్ స్టేషన్ ముట్టడించారు. కొంత కాలంగా విద్యుత్తు సమస్యలు వేధిస్తున్నాయని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కోతలు విధిస్తున్నారని.. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోతలు విధించడమేమిటని ప్రశ్నించారు. లో వోల్టేజ్ సమస్యతో ఇళ్లల్లో ఫ్రిజ్ లు టీవీలు, కూలర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.Read More
నిన్న శనివారం ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జాని పాషాల మధ్య విభేదాలు బైటపడ్డాయి. జీతాలు రావట్లేదని మున్సిపల్ కార్మికులు 3 రోజులుగా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముందే జాని పాషా మీద చేయి చేసుకున్న చైర్మన్ […]Read More
ఆరు దశాబ్దాల తెలంగాణ కలను 14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంలో అవమానాలు, అవహేళనలు, రాజీనామాలు, రాజకీయ ఎత్తుగడలు, ఎన్నో ఉత్తాన పత్తానాలను ఎదుర్కొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు. తెచ్చుకున్న తెలంగాణలో 63 స్థానాలు గెలుచుకుని అధికార పీఠం అందుకున్నారు. ఓటుకునోటు లాంటి ఘటనలతో తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలి అంటే కుట్రలను కూలదోయాలి. రాజకీయ పునరేకీకరణతోనే తెలంగాణ ప్రగతి సాధ్యమని భావించి ఇతర పార్టీల నుండి చేరికలను ప్రోత్సహించారు. రాజకీయ అనిశ్చితి ఉంటే తెలంగాణ మీద […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతుంది.. మాజీ మంత్రి..మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా ఆ సంఘటనను మరిచిపోకముందే జగిత్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. హనుమకొండ జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కూడా పాల్గోన్నారు.. అయితే వేదికపై జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతుండగా మధ్యలోనే మంత్రి రాజకీయాలు మాట్లాడకూడదని మైక్ ను లాక్కున్నారు. దీంతో తనకు మాట్లాడే హక్కులేదా.. ఒక ప్రజాప్రతినిధిగా నా హక్కులను మంత్రిగా ఉన్న పొన్నం […]Read More
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని మాట తప్పి.. ఇప్పుడు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మోసం చేస్తున్నాడని అన్నారు..Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులు..నేతలు ఇసుక దందా చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఇసుక ట్రాక్టర్ల ఆగడాలు భరించలేక పట్టుకుని రాచర్లబొప్పాపూర్ గ్రామస్థుల పోలీసులకు పట్టించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది..Read More
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇసుక దందాకు అడ్డే లేకుండా పోయింది..స్థానికపోలీసులకు చెప్పి చెప్పి విసిగిపోయి స్వయంగా అక్రమ ఇసుక ట్రాక్టర్లను 30 మంది రైతులు పట్టుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలంలోని పులిమామిడి, కుమ్మరి కుంట, కేకే కాలువ శివారులోని రైతుల పొలాలలో బోర్లను పైపులైన్ ధ్వంసం చేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు.. దీంతో గ్రామంలోని రైతులు గత రెండు నెలలుగా […]Read More