Tags :bignews

Breaking News Slider Telangana Top News Of Today

కొత్త మంత్రులు వీళ్లే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈరోజు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నరకు జరగనున్నది..ఈసారి విస్తరణలో ముగ్గురికి అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. వారిలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. ఇక అసెంబ్లీ ఉప శాసనసభాపతి (డిప్యూటీ స్పీకర్)గా రామచంద్రు నాయక్కు అవకాశం ఇచ్చారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆ ముగ్గురికి చోటు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలవుతున్న ఇంతవరకూ పూర్తిస్థాయి క్యాబినెట్ లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక పన్నెండు మందితో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ జాతీయ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఆదివారం రాజ్ భవన్ లో మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీభవన్ లో గుసగుసలు విన్పిస్తోన్నాయి. ఆ ముగ్గురిలో ఎస్సీ సామాజికవర్గం నుండి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గులాబీ పార్టీ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలి..!

సింగిడి న్యూస్ – సిద్ధిపేట ఏప్రిల్ 27 న వరంగల్ లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్బంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు పాల్గోన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ “సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది.. పార్టీ పెట్టి లక్ష్యం సాధించి .. ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి  సాధించి దేశానికి ఆదర్శంగా […]Read More

Breaking News Slider Sports Top News Of Today

సన్ రైజర్స్ , హెచ్ సీఏ వివాదంలో ట్విస్ట్..!

సింగిడి న్యూస్ – క్రికెట్ ఐపీఎల్ మ్యాచులకు అదనంగా ఉచిత టికెట్లను ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహాన్ రావు తమను బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే తమ హోం గ్రౌండ్ ను మార్చుకొవాల్సి ఉంటుంది. అందుకు అనుమతి ఇవ్వాలని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ సీఏ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ గా స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ  విజయసాయిరెడ్డికి మరోసారి  సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని  సీఐడీ పేర్కోన్నది.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్‌ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని  సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రజా ప్రభుత్వంలో కొలువుల జాతర..!

“అబద్దాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలచుకోలేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలకు వివరించి, ప్రజల అనుమతి తీసుకుని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాను” అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఎంపికైన 1532 మంది అభ్యర్థులకు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..!

ఈనెలలో ఎమ్మెల్యేకోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.. ఇందుకుగానూ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలను ఖరారు చేసింది.. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి ఇచ్చిన కాంగ్రెస్.. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్.. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు రావడం విశేషం.Read More

Breaking News Slider Telangana Top News Of Today

తూచ్.. నేను అలా మాట్లాడలేదు

పఠాన్ చెరు మార్చి 7 (సింగిడి) కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను గురువారం నియోజకవర్గంలోని ప్యారా నగర్ డంప్ యార్డ్ బాధితులు కలిశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇన్నాళ్లు మీరు అధికార కాంగ్రెస్ పార్టీ అని కలవలేదు. మా సమస్యను మీకు చెప్పుకోలేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడుతూ నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. పక్కగా నేను […]Read More

Breaking News Business Slider Top News Of Today

పెరిగిన బంగారం ధరలు..?

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550లు పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరగడంతో రూ.87,980 లకు చేరింది. కాగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహాది శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీగా డిమాండ్ నెలకొంది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు..?

గత నెల ఇరవై ఏడో తారీఖున జరిగిన కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు సోమవారం ఉదయం ప్రారంభమయింది.. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్య గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన విజయం సాధించారు. మరోవైపు, నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీగా  శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీపాల్  గెలుపొందారు.Read More