Month: May 2025

Breaking News Slider Telangana Top News Of Today

గుండెపోటుతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి..!!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రసమితికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైరా అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ గా ఉన్న బానోత్ మదన్ లాల్ గుండె పోటుతో కన్నుమూశారు.. అకస్మాత్తుగా  గుండెపోటు వచ్చినందున  ఇంట్లోనే ఆయన  కుప్పకూలిపోయారు.. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని  ఏఐజీ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లల్లో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైరా అసెంబ్లీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ముంబై కి షాక్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ సీజన్ -2025లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు పంజాబ్ సూపర్ కింగ్స్ బిగ్ షాకిచ్చింది. ఈరోజు సాయంత్రం ముంబైతో జరిగిన కీలక మ్యాచ్ లో  పంజాబ్ ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన ముంబై  నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా ఛేదించింది. పంజాబ్ ఆటగాళ్లల్లో ప్రియాంశ్ ఆర్య 62, ఇంగ్లిస్ 73 చెలరేగడంతో ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ భేటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలైన కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ ఛార్జ్ , ప్రముఖ న్యాయవాది గండ్ర మోహాన్ రావు సైతం పాల్గోన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బయటకు రావడం, దానిపై ఎమ్మెల్సీ కవిత […]Read More

Breaking News Health Lifestyle Slider

రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..?

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రస్తుత రోజుల్లో బిజీ బిజీ లైఫ్ లో చాలా మంది తీసుకునే ఆహారం విషయంలో , పాటించే డైట్ విషయంలో సమయపాలనా పాటించరు. కొందరూ రాత్రి తొమ్మిది గంటల తర్వాత భోజనం చేస్తుంటారు. ఇలా చేస్తే చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా భోజనం తీసుకుంటే క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు, డయాబెటిస్ -2 , ఊబకాయం , ఎసిడిటీ, ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ నేతతో భేటీపై విజయసాయి రెడ్డి క్లారిటీ..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత టీడీ జనార్ధన్ రెడ్డి నివాసానికెళ్లి మరి ఆయన్ని కలిశారని వైసీపీ పార్టీ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. ” లిక్కర్ స్కామ్ కేసులో సీఐడీ విచారణకు హజరు కావడానికి ముందు తాడేపల్లి పార్క్ విల్లాలో దాదాపు నలబై ఐదు నిమిషాల పాటు టీడీ జనార్ధన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఆ తర్వాతనే […]Read More

Breaking News National Slider Top News Of Today

ఆపరేషన్ సిందూర్ దాడిలో సంచలనాత్మక ట్విస్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పహల్గాం లో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ దాడిలో దాదాపు వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ ఉగ్రవాదుల స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. మే నెల ఏడో తారీఖున పీఓకే, పాక్ లోని జైషే మహ్మద్ , లష్కరే తొయిబా ఉగ్ర స్థావరాలను ఇండియన్ […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై కవిత సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఏసీబీ విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే, మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ” ప్రజా సమస్యలను దృష్టి మళ్లించడానికే కేటీఆర్ పై […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు..!

సింగిడి న్యూస్ , వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున విచారణకు హజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున విదేశీ పర్యటన అనంతరం విచారణకు హజరు అవుతానని” తిరిగి లేఖ రాశారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ ఎమెల్యే శంకర్ నాయక్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం.!

సింగిడిన్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నేత బానోత్ శంకర్ నాయక్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ నందు దాదాపు 500 మంది నిరుపేదలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ మానుకోట ప్రజలకు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శంకరన్న పుట్టినరోజు సందర్భంగా […]Read More