మెగాస్టార్ చిరంజీవి సినిమాతో 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామివారిని ఆయన దర్శించుకున్నారు. మెగాస్టార్తో తీయబోయే మూవీ స్క్రిప్ట్ స్వామి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. సినిమా కథలకు వైజాగ్ ను తాను సెంటిమెంట్ గా భావిస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోగా.. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి […]Read More
Tags :slider
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి ఎర్రం పిచ్చమ్మ (85) ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మాతృమూర్తి మృతితో వైవీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వైసీపీ శ్రేణులు.. నేతలు.. ఆయన అభిమానులు వైవీకి సానుభూతి తెలుపుతున్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనంతరం మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. అందులో భాగంగా ఈనెల ఇరవై తారీఖున ముందుగా సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు.ఈ క్రమంలో, ఈ నెల 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో […]Read More
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ హారీష్ రావు తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు ఆయనకు లేవని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడే నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని రేవంత్ రెడ్డి మాజీ మంత్రి […]Read More
మాములుగా మనం కంటికి సరిపడా నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తే, అతి నిద్ర పలు రోగాలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ 8-9 గంటల కంటే ఎక్కువగా పడుకుంటే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఊబకాయానికి దారి తీయడంతో పాటు గుండెజబ్బులు వస్తాయి. ఒత్తిడికి లోనై చిన్నచిన్న విషయాలకూ కోపం వస్తుంది. తల, వెన్నునొప్పి, కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. ఈ మార్పులు వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయి.Read More
జూబ్లీహిల్స్ లోని బీజేపీ ఎంపీ.. మాజీ మంత్రి డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు. ముసుగు, క్లౌజులు ధరించి ఇంట్లోకి దుండగుడు చొరబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లోకి చొరబడి ఆ దుండగుడు కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దుండగుడు వచ్చిన సమయంలో ఎంపీ ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని, భద్రత పెంచాలని […]Read More
‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడ లో జరిగిన ‘రాబిన్ హుడ్’ మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా విడుదలైన ‘పుష్ప-2’ రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరో గా నటించాడు.. […]Read More
గత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను చెల్లించే పనిలో ఉంది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం బకాయిలు రూ.25 వేల కోట్లు అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ ఏడాది జనవరిలో కొంత మంది ఉద్యోగుల బకాయిలు చెల్లించినట్లు తెలిసింది. ఈ బకాయిలలో, ఈ నెలాఖరు నాటికి రూ.4 వేల కోట్ల నుండి రూ.5 వేల కోట్ల వరకు జీపీఎఫ్ మరియు పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో చెల్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుండి […]Read More
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిపై సీఎంఓలో ఫిర్యాదు నమోదైంది. అధికార హోదా లేకున్నా.. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మహమ్మద్ ఫరూఖ్ సీఎంఓకు ఫిర్యాదు చేశారు. మంత్రుల ఫిర్యాదు మేరకు ఇంటలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.Read More
కుక్క తోక వంకరే అని తెలుగులో ఓ సామెత ఉంటుంది. ఈ సామేతను నిజం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం పై జరిగిన చర్చలో దాదాపు రెండున్నర గంటలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత అంశాల గురించి కాకుండా సిద్ధాంతఫరంగా విమర్శలు చేయాలి.. రాజకీయ విమర్శలు చేయాలి. అంతేకాని వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడోద్దు అని గౌతమ […]Read More