దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ..!

తెలంగాణలో ఉన్న 119నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు. 2025-26 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను నిన్న బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టీ ప్రసంగిస్తూ” స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులను కల్పించనున్నట్లు పేర్కొన్నారు..
రాష్ట్రంలో ఉన్న పలు గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచుతాము.. విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం అమలు చేస్తాము.. ఆరోగ్య శ్రీ పరిధి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాము.. కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చింది తమ ప్రభుత్వం… 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ లబ్ధి జరిగింది..
ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ఖర్చు 20 శాతం పెంచాము.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా తెలిపారు.. మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రకటించారు.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751గా ఉంది.. వృద్ధిరేటు 9.6 శాతం.. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579.. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1.8 రెట్లు ఎక్కువ అని భట్టి విక్రమార్క అన్నారు.
