తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు జరిగే పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించిన కుల సర్వేను తప్పుబడితే బీసీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విడమరిచి చెప్పారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా బీసీ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి […]Read More
Tags :slider
తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరు గాంచిన వేముల వాడ ఆలయానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరిగిన చర్చలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పాలనలో దేవాలయాల రూపు రేఖలను మార్చాము.దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశాము. తెలంగాణ ఏర్పడకముందు యాదాద్రి ఆలయం ఆదాయం ఎంత.. […]Read More
కాంగ్రెస్ పాలనలో జీతం కోసం ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిందేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తమ జీతాలు కావాలంటే రోడ్డు ఎక్కాల్సిందేనా అంటూ మాజీ మంత్రి .. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు జీతాల కోసం నిమ్స్ లో ధర్నాకు దిగిన ఉద్యోగుల వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఎక్స్ లో “నిమ్స్ సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా, వారిని రోడ్డెక్కే దుస్థితికి నెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. […]Read More
కేసీఆర్ … అనే వ్యక్తిని రాజకీయంగా ఎవరైన విమర్శించవచ్చు. కానీ పద్నాలుగేండ్ల తెలంగాణ ఉద్యమంలో.. పదేండ్ల పాలనలో ఆయనని మెచ్చుకున్నవాళ్ళే తప్పా తిట్టినవాళ్ళు లేరు ఒక్క ఆయనంటే గిట్టనివాళ్ళు తప్పా. తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. సభలో దేవాలయాలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ “యాదగిరిగుట్ట కట్టాలన్న ఆలోచన రావడం, భగవంతుడు […]Read More
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తన సహచర ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతున్న సమయంలో సభలోని తన సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేశారు. దీంతో ఒక్కసారి కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే దానం నాగేందర్ తాను సీనియర్ ఎమ్మెల్యేని, ఏం మాట్లాడాలో తనకు తెలుసని ఇతర ఎమ్మెల్యేల పట్ల రుసరుసలాడుతూ నేను మంత్రిగా పని చేశాను.. […]Read More
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకటి కాదు రెండు కాదు పదిహేను నెలలవుతుంది. ఇంతవరకూ ముఖ్యమంత్రి మంత్రుల మధ్య.. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదరడం లేదా..?. జాతీయ పార్టీ అంటేనే వర్గాలు అనే ముద్రను ఇంకా నిజం చేస్తున్నారా.. ? . లేదా వీరివురి మధ్య సమన్వయం లోపించిందా అంటే.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు.. సీఎం.. అధికార పార్టీ సభ్యుల తీరును చూస్తుంటే అవుననే అన్పిస్తుంది. ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ […]Read More
ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఏపీలోని వైజాగ్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు జనాదరణ కరువు అయింది… మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు ఆన్‌లైన్‌లో ఇంకా ఐపీఎల్ టికెట్లు అమ్ముడుపోలేదు.. విశాఖ వేదికగా ఈనెల 24న లక్నోతో తలపడనున్నది ఢిల్లీ జట్టు.. అయితే టికెట్ల అమ్మకాలకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపంతోనే టిక్కెట్లు అమ్ముడు పోలేదని క్రిటిక్స్ చెబుతున్నారు.. మరోవైపు ఇప్పటికే విశాఖకు చేరుకున్నయి ఢిల్లీ క్యాపిటల్స్ […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఇటీవల గుడ్ బై చెప్పిన.. రాజకీయాల నుండి తప్పుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేసింది.. ఈ నోటీసుల్లో ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని సీఐడీ పేర్కోన్నది.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హజరయ్యారు. కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని సీఐడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం..Read More
తెలంగాణలో కాంగ్రెస్ గత పది హేను నెలల పాలనలో ఆటో డ్రైవర్లు, అన్నదాతల ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడుతుంటే 250 కోట్లతో అందాల పోటీలా? కాంగ్రెస్ పాలనలో రైజింగ్ కాదు.. తెలంగాణ డౌన్ ఫాలింగ్! బంగారం లాంటి రాష్ర్టాన్ని రేవంత్ కుప్పకూల్చిండు. క్యాన్సర్‌తో పోల్చి తెలంగాణను నాశనం చేసిండు. రాష్ట్ర ఆదాయం రూ.71 వేల కోట్లు తగ్గిందని ఒప్పుకొని ముఖ్యమంత్రే అప్రూవర్‌గా మారిండు. డబ్బుల్లేవంటూనే అందాల పోటీలకు 250 కోట్లా? రేవంత్ దాటిన రేఖలపై మేమూ మాట్లాడగలం. మేం […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందినహుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో గళమెత్తిన అంశాలు హుజురాబాద్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు అందాలని తాను దండం పెట్టి అడుగుతున్నానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూనిపర్తి, మాదన్నపేట్, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బద్వాన్పల్లి గ్రామాల్లో నీటి సమస్య కారణంగా వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులతో […]Read More