బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..!

Bandi Sanjay Kumar
ఈ ఉగాది పండుగక్కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడ్ని నియామిస్తారని వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవిపై మాజీ అధ్యక్షుడు.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు..
మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష నియామక బరిలో నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేను.. జాతీయ నాయకత్వం ఒకవేళ ఇస్తే మాత్రం వద్దనను.. అధ్యక్షుడిగా ఇప్పటికే నేనేంటో నిరూపించుకున్నాను..
కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.. ఇలా ప్రచారం చేసుకో వడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకం అని ఉద్ఘాటించారు.. కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దు.. పార్టీ పెద్దలు అధ్యక్షుడ్ని నిర్ణయిస్తారు.. నేను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నాను అని ఆయన వ్యాఖ్యానించారు.
