తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసింది. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ ” మహారాష్ట్రలో బీఆర్ఎస్ బీజేపీఎకి బీటీమ్ గా పనిచేస్తుంది. ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా బీజేపీ వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతన్నలను రోడ్లపై వదిలేసింది. చేసిన రుణమాఫీ వడ్డీలకు సైతం సరిపోలేదు. ఆటోడ్రైవర్లను ఉసిగొల్పి ధర్నాలకు పిలిపించింది. నిరుద్యోగ యువతను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారిని మోసం చేసిందని సంచలన ఆరోపణలు […]Read More
Tags :danasari anasuya
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి… మంత్రి సీతక్కపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అకాల వర్షాలతో పండించిన ధాన్యం ఆగమైంది. పత్తి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇవేమి తమకు పట్టవన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికెళ్లారు. పత్తి రైతుల కన్నీళ్లను చూసైన మంత్రి సీతక్క కనికరించరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర లేవరని మాజీ మంత్రి హారీష్ రావు […]Read More
బౌరంపేటలో లైంగిక దాడికి గురై హైదర్ నగర్ లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగు సంవత్సరాల చిన్నారిని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ తో కలిసి చిన్నారిని, కుటుంబాన్ని మంత్రి సీతక్క […]Read More
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం గుండంపల్లి లో పండిట్ భాను ప్రసాద్ శాస్త్రి వేదమంత్రాల మంత్రోత్సరణ వారి దివ్య కరకరములచే పూజలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క పాల్గొన్నారు … ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ వారు కాకతీయుల నాటి 12వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం శిథిలవస్థలో ఉంది మహాశివరాత్రి రోజున […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జలసౌధలో ప్రభుత్వ ఉద్యోగులతో కల్సి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులతో కల్సి మంత్రి నృత్యం ఆడారు. జలసౌధలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ఇంజినీరింగ్ విభాగం ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహించింది. అక్కడి ఉద్యోగులతో కల్సి బతుకమ్మ ఆట ఆడుతూ పాటలు పాడుతూ మంత్రి సీతక్క కాసేపు డాన్స్ వేశారు. మరోవైపు ఉస్మానీయా యూనివర్సిటీలోనూ జరిగిన వేడుకల్లో సైతం మంత్రి పాల్గోన్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కు ఓ వ్యక్తి కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల నాలుగో తారీఖున గుర్తు తెలియని ఓ వ్యక్తి ఓ నంబరు నుండి మంత్రి సీతక్కకి కాల్ చేశాడు. మంత్రి సీతక్కకు మూడు సార్లు కాల్ చేసి అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు మంత్రి సిబ్బంది. మంత్రి కారు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళా కమీషన్ నోటీసులు జారీ చేశారు. నిన్న గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ఉచిత బస్సులో ఎల్లిపాయలు పొట్టు తీయడం తప్పు కాదని మా సీతక్క చెబుతుంది. మేము ఎప్పుడు అన్నాము అక్క ఎల్లిపాయలు పొట్టు తీయడం.. మేము ఎక్కడ కూడా తప్పు అనలేదు. ఎల్లిపాయలు పొట్టు తీయడం కాకపోతే డాన్సులు.. […]Read More
తెలంగాణలో గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు.సీఎం సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని కోలుకుంటోంది.ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. […]Read More
కోల్ కత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యచారానికి నిరసనగా… బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర జూడాల సంఘం ఈరోజు బుధవారం ఓపీ సేవలను బంద్ పెట్టి నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే.. దీంతో జూడాలు ఈ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. జూడాల నిరసనలకు మంత్రి సీతక్క సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు తమ ప్రభుత్వం అండగా […]Read More
ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు..ఏది అబద్ధం అంటూ మాజీ మంత్రి హారీష్ రావు మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది […]Read More