నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

Telangana government has good news for unemployed youth..!
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. వరంగల్ లోని ఎంకే నాయుడు కన్వేన్షన్ హాల్ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణను తెచ్చుకుందే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించుకోవడానికి. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని అన్నారు.
త్వరలోనే అంగన్ వాడీ కేంద్రాల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అని మంత్రి సీతక్క ప్రకటించారు. ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాల్లో అర్హులైన నిరుద్యోగ యువత అందరూ పాల్గోని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని యువతను కోరారు.
