ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు పాసైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఈరోజు శనివారం సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హాస్తం పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ పథకం కింద సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నది.Read More
Tags :anumula revanth reddy
జాబ్ క్యాలెండర్ పై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి క్లారిటీచ్చారు. నిరుద్యోగ యువత… గ్రూప్ పరీక్షల అభ్యర్థులతో… విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” నిరుద్యోగుల సమస్యలు మాకు తెల్సు. వారి సమస్యలను పరిష్కరించడమే మా తొలి ప్రాధాన్యత. వారి విజ్ఞప్తి మేరకే గ్రూప్ -2 పరీక్షను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తున్నాము.. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తాము .. ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదో తారీఖు […]Read More
తెలంగాణలో అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్టుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 🔹ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావులతో కలిసి సచివాలయంలో విద్యావేత్తలు ప్రొ.హరగోపాల్, ప్రొ. కోదండరాం, ప్రొ.శాంతా సిన్హా, […]Read More
హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సభ్యులుగా మున్సిపల్ శాఖమంత్రి ,రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ మంత్రులు,జీహెచ్ఎంసీ మేయరు,సీఎస్,డీజీపీ తదితరులు ఉండనున్నరు అని ప్రభుత్వం ప్రకటించింది. హైడ్రా విధివిధానాల గురించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది.Read More
మ్ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసల వర్షం కురిపించారు. నిన్న గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయడానికి ఏడు వేల కోట్ల రూపాయలను ఆయా రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరింది. దీనిగురించి వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందిస్తూ ” సరిగ్గా పదిహేను ఏండ్ల కిందట దేశ వ్యాప్తంగా […]Read More
ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విన్నవిస్తూ ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్ధిపేట ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగను అని సవాల్ విసిరారు. సవాల్ విసరడమే కాకుండా ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు అగస్టు 15లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తే తన రాజీనామాను ఆమోదించాలని లేఖ […]Read More
తెలంగాణను తెచ్చిన పార్టీ… తెచ్చిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయా..?. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో ఇది అంతా జరుగుతుందా ..?. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన టీడీపీ పూర్వపు నేతలైన తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారా.?.. కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ నేతలకు.. […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు అయింది. వచ్చే నెల మూడో తారీఖున సీఎం హైదరాబాద్ నుండి బయలు దేరి వెళ్లనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల పదకొండో తారీఖున తిరిగి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు.Read More
బీఆర్ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు అయ్యాయి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల,శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్,ఎంపీ గడ్డం వంశీ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏడు లక్షల కోట్ల అప్పులు పాలైన కానీ ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. గతంలో బీఆర్ఎస్ నాలుగైదు విడతలుగా […]Read More