అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి..!

Revanth Reddy Telangana Cm
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారు అయింది. వచ్చే నెల మూడో తారీఖున సీఎం హైదరాబాద్ నుండి బయలు దేరి వెళ్లనున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో పలు కంపెనీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వచ్చే నెల పదకొండో తారీఖున తిరిగి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు.
