Editorial Slider Telangana Top News Of Today

తన మూలాలను గ్రహించిన బీఆర్ ఎస్..సత్ఫలితం ఉంటుందా..?

బీఆర్ఎస్ అయిన అప్పటి టీఆర్ఎస్ అయిన ముందుగా గుర్తుకు వచ్చేది ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జలవిహార్ లో పురుడుపోసుకున్న పార్టీ అని ఠక్కున అందరి మదిలో మెదులుతుంది. అంతటి మహోత్తర చరిత్ర .. మూలాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనమూలాలను మరిచిపోయి అధికారమే పరామవదిగా కాంగ్రెస్ టీడీపీ లకు చెందిన ఎమ్మెల్యేలను.. నేతలను చేర్చుకుని ఉద్యమ పార్టీ కాస్తా పక్క పొలిటికల్ పార్టీగా అవతరించింది. పదేండ్లలో డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర […]Read More

Movies Slider

భారతీయుడు-2 సినిమాపై గుడ్ న్యూస్

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా … ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్, లేటు వయసులో హాట్ గా ఉండే కాజల్ అగర్వాల్ ,సిద్ధార్థ్ ప్రధానపాత్రల్లో నటించగా ఈ నెల పన్నెండో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ భారతీయుడు-2. ఈ చిత్రం గురించి తెలంగాణ ప్రభుత్వం చిత్రం యూనిట్ కు వెసులుబాటు ఇచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ టికెట్ల ధరలను పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. […]Read More

Health Slider

మీరు రోజూ ఫౌడర్ రాసుకుంటున్నారా..?

మీరు రోజూ ఫౌడర్ రాసుకుంటున్నారా..?. ముఖానికి మేకప్ లేనిది బయటకు వెళ్లరా..?.. అయితే ఇది మీకోసమే.. మీరు పక్కగా తెల్సుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం.. అది ఏమిటంటే..?.తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ విభాగం ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కాన్సర్ (ఐఏసీఆర్) కీలక ప్రకటన చేసింది. పౌడర్ వినియోగానికి అండాశయ క్యాన్సర్‌కు సంబంధం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు, పౌడర్‌కు మధ్య సంబంధంపై ఓ అధ్యయనం తరువాత ఈ అంచనాకు […]Read More

Health Slider

గుండెపోటు రావడానికి ముందు కన్పించే లక్షణాలు ఇవే..?

సహజంగా గుండెపోటు ఒక్కసారిగా వస్తుందని అందరూ భావిస్తారు.. కానీ గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. గుండెపోటుకు ముందు చాలా మందిలో ఛాతి పట్టేసినట్టు, ఒత్తిడి పెట్టినట్టు ఉంటుందట. చాలా రోజుల ముందుగానే ఈ ఇబ్బంది మొదలవుతుందట. తగినంత ఆహారం, నీరు తీసుకుంటున్నా నిత్యం నీరసం ఆవహించినట్టు ఉంటే కూడా సందేహించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ఊపిరాడనట్టు ఉండటం, ఛాతిలో నొప్పి వంటివి ఉంటే […]Read More

Slider Telangana

ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పట్ల సామరస్యపూర్వకంగా వ్యవహరించాలి.. వారి వ్యక్తిగత జీవిత అంశాల్లోకి వెళ్లకూడదు. బాధితులు,జడ్జ్ ,న్యాయవాదుల ఫోన్ నంబర్లు,వారి ఫోటోలను పబ్లిసిటీ చేయద్దు. ఈ కేసులోని అంశాలను చాలా సున్నితంగా విచారించాలి అని వ్యాఖ్యనించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.Read More

Slider Telangana

10ఎకరాల్లోపే రైతు భరోసా

కేవలం పది ఎకరాల్లోపే ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ రోజు ఖమ్మంలో జరిగిన రైతుభరోసా పథకం పై ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల నుండి మంత్రులు పొంగులేటి ,తుమ్మల,భట్టి విక్రమార్క బృందం పలు అభిప్రాయాలను సేకరించింది. ఈ అభిప్రాయాల మేరకు కేవలం పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలి.. కౌలు రైతులకు సబ్సిడీపై వ్యవసాయానికి సంబంధించిన […]Read More

Slider Telangana

తెలంగాణ డీజీపీగా జితేందర్

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా కానీ నిన్న మంగళవారం సీఎం మహబూబ్నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ […]Read More