వైసీపీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది..?

 వైసీపీకి పట్టిన గతే టీడీపీకి పడుతుంది..?

Chandrababu andhrapradesh CM

Loading

ఏపీలో గతంలో పాలించిన  వైసీపీ హయాంలో జరిగిన తప్పులను తెలుగు తమ్ముళ్లు కూడా చేస్తే రానున్న ఎన్నికల్లో వారికి పట్టిన గతే టీడీపీకి పడుతుంది.. మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

నిన్న శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ ముఖ్యం.. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదని ఆయన వెల్లడించారు. మనం చేసే మంచి పనులే వచ్చే ఎన్నికలకు ఉపయోగపడుతాయి.

ఎన్ని అరాచకాలు చేయకపోతే వైసీపీ 11 స్థానాలకు పడిపోయిందో గ్రహించాలని సూచీంచారు. టీడీపీ కూడా అదే తీరున వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణకాష్టమే అవుతుందని అన్నారు.కూటమిలో ఎవరూ తప్పుచేసినా ఆ ప్రభావం సీఎంపై ఉంటుందని గుర్తించాలన్నారు.

తప్పు చేస్తే ఎవరినీ వదిలి పెట్టబోము.. అలాగని కక్షసాధింపులకు వెళ్లకూడదని బాబు సూచించారు. కొత్తగా మద్యం లో వేలు పెడతామంటే కుదరదని అన్నారు. మద్యం, ఇసుక విధానాలపై మళ్లీ విడిగా అందరితో మాట్లాడతానని బాబు చెప్పారు. 

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *