అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కల్సి పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ “గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నాము. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు,ఐదోందలకే గ్యాస్ సిలిండర్,రెండోందల యూనిట్ల ఉచిత కరెంటు,ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు లాంటి హామీలను అమలు చేశాము. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష […]Read More
ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విన్నవిస్తూ ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇంటి అద్దెలు చెల్లించడం కూడా భారంగా మారిందని, పీఎఫ్ డబ్బులు సైతం జమచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ఈ చిరు ఉద్యోగుల వెతలు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… సిద్ధిపేట ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగను అని సవాల్ విసిరారు. సవాల్ విసరడమే కాకుండా ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు అగస్టు 15లోపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తే తన రాజీనామాను ఆమోదించాలని లేఖ […]Read More
హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్ల గురించి కమీషనర్ ఆఫ్ జీహెచ్ఎంసీ అమ్రపాలి కాట (ఐఏఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పార్కింగ్ గురించి పలు మార్గదర్శకాలను అమ్రపాలి విడుదల చేశారు. నగరంలో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్,సింగిల్ ,మల్టీ స్క్రీన్స్ ఉన్న అన్ని థియేటర్లలో పార్కింగ్ వసూళ్లపై వస్తోన్న పిర్యాదులతో అప్రమత్తమైన అమ్రపాలి పార్కింగ్ బిల్లుల గురించి కీలక ఆదేశాలను జారీ చేశారు. తొలి ఆర్ధగంట వరకు ఎలాంటి […]Read More
త్వరలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ” రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కర్కి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము… ఆరోగ్య శ్రీ కార్డులను వేర్వేరుగా అందజేస్తాము” అని ఉద్ఘాటించారు..Read More
తెలంగాణలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టు.. ఒక్క ఎకరాకు సాగునీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం డిజైన్ పై ఎఎస్డీఎనే ఆశ్చర్యపోయింది..కాళేశ్వరం ప్రాజెక్టును సాగునీళ్ల కోసం కాదు డబ్బుల కోసం నిర్మించారు.. సీతారామ,భక్తరామదాసు ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగింది.. కొత్త రేషన్ కార్డులు.ఆరోగ్య శ్రీ కార్డుల గురించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తాము..ఒకేసారి రైతులకు రెండు లక్షల రుణమాఫీ […]Read More
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం ఏర్పడింది..విండోస్ సాఫ్ట్ వేర్ లో బ్లూ ఎర్రర్ స్క్రీన్ పై మైక్రోసాఫ్ట్ సంస్థ ట్వీట్ చేసింది.. ఈ సమస్యతో జాతీయ అంతర్జాతీయ విమానసర్వీసుల్లో ఇబ్బందులు తలెత్తాయి..ట్రాకింగ్..బుకింగ్ లాంటి పలు సేవలు నిలిచిపోయాయి.. అతిత్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఆ సంస్థ ట్విట్టర్లో ట్వీట్ చేసింది..విండోస్ సేవల్లో అంతరాయంతో ఢిల్లీ,ముంబై ఎయిర్పోర్టుల్లో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి..Read More
తనకు ప్రాణ హాని ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ…ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను చంపేస్తామని కాల్స్..మెసేజ్స్..వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు ” అని అన్నారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై కాల్పులు జరిపిన నిందితుడ్ని ఇంతవరకు పట్టుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లీంలను లేకుండా చేయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయి..అందులో భాగంగానే నాకు ఇలా బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు..Read More
తెలంగాణను తెచ్చిన పార్టీ… తెచ్చిన తెలంగాణను పదేండ్లలోనే దేశానికే ఆదర్శంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయా..?. పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగల్లో ఇది అంతా జరుగుతుందా ..?. అందులో భాగంగానే బీఆర్ఎస్ కు చెందిన టీడీపీ పూర్వపు నేతలైన తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారా.?.. కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ నేతలకు.. […]Read More