హైడ్రా తో ‘ హై”డర్” బాద్’

HYDRA
హైడ్రా నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ ప్రజలనే కాదు అక్కడ పెట్టుబడులు పెడదామని ఆశించిన రియల్ ఎస్టేట్ వాళ్లను సైతం కంగారుపెట్టిన అంశం. హైడ్రాకు ఎవరూ వ్యతిరేకం కాదు. హైడ్రా అనేది మంచి వ్యవస్థ. అక్రమంగా నిర్మించిన భవనాలను.. అక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను.. చెరువులను పరిరక్షించడమే ఈ వ్యవస్థ యొక్క ముఖ్య లక్ష్యం. అంతవరకూ బాగానే ఉంది. కానీ గత వంద రోజుల నుండి హైడ్రా పేరుతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
బడా బడా రాజకీయ నాయకులను.. సెలబ్రేటీలను వదిలేసి .. రుణాలను తీసుకోనో.. ఉన్నాఅస్తులను అమ్ముకోనో ఇండ్లను కట్టుకున్న వారివి ఎలాంటి నోటీసులివ్వకుండా .. ఒకవేళ నోటీసులు ఇచ్చిన తెల్లారే.. లేదా శనివారమో కూల్చివేతలకు దిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబీకింది. మరోవైపు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయిందని రియల్టర్లు వాపోతున్నారు. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్..
హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ అనేలా ఉన్న పరిస్థితి కాస్తా ఇప్పుడు పతన స్థాయికి చేరిందని వాళ్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.హైడ్రా తో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందని ఇటు ప్రతిపక్షాలు.. అటు మీడియా కోడై కూస్తున్నారు. ఏది ఏమైన సరే హైడ్రా పై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసి రియల్ బూమ్ ను మళ్లీ తీసుకురావడానికి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని వారు కోరుతున్నారు. లేకపోతే హైడ్రాతో హైడర్ బాద్ గా మిగలడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో..?