దీపావళి పండుగ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు.. దీనిపై ఓ వీడియో ను విడుదల చేశారు.. ఆ వీడియోలో లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దని దీపావళి సందర్భంగా అందర్నీ కోరారు. ‘లక్ష్మీదేవికి మనం పూజ చేస్తాం. ఆ మాత బొమ్మ పెట్టి టపాసులు అమ్ముతున్నారు. ఎప్పటి నుంచో ఈ కుట్ర జరుగుతోంది. అలాంటివి కొనొద్దు. కాల్చొద్దు. ఇలా సంకల్పం తీసుకుంటే మరోసారి అలాంటి టపాసులు తయారు చేయరు’ అని ఆయన చెప్పారు. […]Read More
ఏపీ అధికార పార్టీ లైన టీడీపీ జనసేన కూటమిలో లకలుకలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈ దీపావళి పండుగ రోజు నుండి అమలు చేయనున్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.. రేషన్ కార్డు ఉన్న అందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులేనని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం ‘1.50 కోట్ల మంది అర్హులున్నారు. రేషన్ కార్డు-ఆధార్-LPG లింక్ చేసుకున్న వారు ఉచిత గ్యాస్ కోసం […]Read More
మనం నిత్యం ఉపయోగించే ₹10, ₹20, ₹50, ₹100 నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా?. ఇటీవల ఆర్బీఐ ఓ నివేదికను విడుదల చేసింది.. ఈ నివేదిక ప్రకారం ₹10 నోటు తయారీకి ₹0.96 ఖర్చవుతుంది. అదే ₹20 నోటుకి ₹0.95 *₹50 5 ₹1.13 **100 ₹1.77,200 నోటుకి ₹2.37 * లు ఖర్చవుతుంది. అలాగే ₹500 నోటుకి ₹2.29 ఖర్చవుతుంది. ₹200 నోటు తయారీకి ₹500 నోటు తయారీ కంటే ఖర్చు ఎక్కువ […]Read More
ఆ కంపెనీ వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది.. నెల నెల కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అయితేనేమి ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు .. కార్మికులకు ఇవ్వడానికి మాత్రం పైసా లేవంటుంది. అందుకే ఇటీవల తెలుగు ప్రజల చివరి పెద్ద పండుగ దసరాకు సగం జీతాలే ఇచ్చింది. పోనీ చీకట్లను తరిమి వెలుగులునింపే దీపావళి పండుగకైన ఫుల్ శాలరీ వస్తుందేమో అని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి నిరాశనే మిగిలిచ్చింది. ఇంతకూ […]Read More
బీఆర్ఎస్ కు చెందిన యువనేత.. ఇటీవల నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్ఎస్పీ కోమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో ఓ ఇల్లును కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. అప్పుడు ఎన్నికల సమయంలో అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్పీ ఎప్పుడు […]Read More
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్ పనితీరును గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్, దావూద్ ఇబ్రహీంతో పోల్చిన బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజ్ శ్రవణ్.. రేవంత్‌రెడ్డిని ప్రకృతే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. దాసోజు శ్రవణ్ ఇంకా ఏమన్నారంటే… ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వాడు తెలంగాణ ప్రజలకు ఆద్యుడిగా ఉండాలి. రేవంత్ తీరు కుక్క తోక వంకర అనే సామెతను గుర్తుకు తీస్తోంది. అహ్మదాబాద్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేకి ఓ అగంతక వ్యక్తి నుండి బెదిరింపులు ఎదురయ్యాయి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ఓ అగంతక వ్యక్తి కాల్ చేశాడు..కాల్ చేసి తక్షణమే ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు..కేసు నమోదు చేస్కున్న పోలీసులు సదరు వ్యక్తిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు..Read More
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుకను అందించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెల్సిందే.. దీంతో ఆ డీఏ 3.64%ఇస్తున్నట్లు ఆదేశాలను జారీ చేసింది.. పెంచిన డీఏ జూలై 1,2022నుండి వర్తింపు ఉంటుంది అని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కోన్నది..Read More
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతి లో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.Read More