Tags :zimbambe

Slider Sports

టీమ్ ఇండియా భారీ స్కోర్

నిన్న శనివారం జరిగిన జింబాబ్వేతో తొలి టీ20లో తడబడ్డ భారత బ్యాటర్లు రెండో టీ20లో చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(100) సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ (77) హాఫ్ సెంచరీతో రాణించారు. చివర్లో రింకూ సింగ్(48) తనదైన స్టైల్లో బౌండరీలతో మెరుపులు మెరిపించారు. తొలి మ్యాచ్ లో ఫర్వాలేదనిపించిన కెప్టెన్ శుభ్మన్ గిల్(2) ఈసారి విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది.Read More

Slider Sports

అభిషేక్ శర్మ విధ్వంసం

జింబాబ్వేతో నిన్న శనివారం జరిగిన తొలి టీ20లో   భారత ఓపెనర్ అభిషేక్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయిన సంగతి తెల్సిందే. కానీ ఇవాళ రెండో టీ20లో సెంచరీతో చెలరేగారు. కేవలం 46 బంతుల్లోనే 8 సిక్సర్లు, 7 ఫోర్లతో శతకం బాదారు. దీంతో అరంగేట్రం తర్వాత రెండో మ్యాచ్లోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్  అభిషేక్ రికార్డ్ సృష్టించారు. కాగా సెంచరీ తర్వాతి బంతికే అభిషేక్ ఔట్ అయ్యారు.Read More

Slider Sports

అభిషేక్ శర్మ ఊచకోత

జింబాబ్వేతో జరుగుతున్న 2వ టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నారు. మయర్స్ వేసిన 11వ ఓవర్ 4, 6, 4, 6, 4 వరుస బౌండరీలు బాదారు. మరో వైడ్ 2, 2 రావడంతో ఆ ఓవర్లో మొత్తం 28 రన్స్ వచ్చాయి. దీంతో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. 12.2 ఓవర్లకు భారత్ 120/1 రన్స్ చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(81), రుతురాజ్(33) ఉన్నారు.Read More

Slider Sports

టాస్ గెలిచిన భారత్

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. జింబాబ్వే, భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం ఆడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఘోర పరాభావానికి గాను విమర్శలు రావడంతో.. ఆటతోనే గట్టి సమాధానం ఇవ్వాలని భారత్ భావిస్తోంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకొని, విమర్శకుల నోళ్లు మూయించాలని అనుకుంటోంది. మరోవైపు.. తొలి […]Read More