ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పరిస్థితి అసలు బాగోనట్లు ఉంది.. అధికారంలోకి వస్తామని కలలు కన్న ఆ పార్టీ నాయకుల అడియాశలు అయ్యాయి..ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసులో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్ అయ్యారు. చెన్నై నగరంలోని బిసెంట్ నగర్ లో రాజ్యసభ ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు పుట్ పాత్ […]Read More
Tags :ys jagan
ఇది చదవడానికి కొద్దిగా ఎటకారంగా వింతగా ఉన్న కానీ ఇదే నిజమన్పిస్తుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన పనులను చూశాక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ చీఫ్ … ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొదటి వంద రోజులు చేసిన పనుల్లో భాగంగా ఏకంగా ఆయన మీడియా సాక్షిగానే మాజీ సీఎం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను […]Read More
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెల 11తారీఖు నుండి 17వరకు సెలవులు మంజూరు చేసింది. అయితే సెలవుల రోజు తిరుపతి వదిలి వెళ్లోచ్చు.కానీ రాష్ట్రం దాటి వెళ్లకూడదని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.మరోవైపు ఈ నెల 12తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదే రోజు రాత్రి కుటుంబ సభ్యులతో సహా తిరుపతి […]Read More
కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి 164స్థానాల్లో, వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు 21ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమి, 4ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుపొందిన సంగతి కూడా తెల్సిందే.Read More
ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై పిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో టీచర్ల బదిలీలు విషయంలో ఒక్కో టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీ కి పిర్యాదు చేశారు. తప్పకుండ బొత్స సత్యనారాయణ ను […]Read More
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలోని ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అన్ వ్యక్తి పలువురితో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టాడు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164స్థానాలు.. వైసీపీ పదకొండు స్థానాల్లోనే మాత్రమే గెలుపొందింది. దీంతో వైసీపీ ఓడిపోవడంతో వేణు గోపాల్ రెడ్డి తన ఊరు.. ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.. అతనికి ఎంతగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు […]Read More
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో 11ఎమ్మెల్యే..4ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణం అని ఆ పార్టీ నేత .మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వాపోయారు. ఆ చట్టంపై టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారని చెప్పారు. ‘ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని […]Read More
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు వైసీపీ నేతలపై..వారి ఇండ్లపై దాడులకు దిగుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలో రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండటంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వినలేదు. సుత్తెతో పగలగొట్టి నేలమట్టం చేశాయి. రెండేళ్ల కిందట ఈ ఫ్లైఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, భరత్ శంకుస్థాపన చేశారు. రూ.56.13 కోట్లతో చేపట్టిన పనులు కూడా […]Read More
ఏపీలో ఈరోజు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఘోర ఓటమిని కట్టబెట్టడంపై వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. గత ఐదేండ్లలో తమ ప్రభుత్వం తరపున అమ్మఒడి డబ్బులు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినా, అవ్వాతాతలకు ఇంటివద్దకే పెన్షన్ పంపినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కోటి మందికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వారు ఆప్యాయత చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల […]Read More
ఈరోజు విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలను నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More