Tags :telanganacm

Breaking News Slider Telangana Top News Of Today

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

రేపు గురువారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఎల్లుండి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్కే తో పాటు పలువురు సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు.. త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చ జరుపనున్నారు.. తదనంతరం మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు […]Read More

Slider Telangana Top News Of Today

రేపు యాదాద్రికి మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు  రేపు గురువారం యాదగిరి గుట్టలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిపై ఒట్టుపెట్టి ఆయన మాట తప్పారు  దానికి పాపపరిహారం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాకకుండా చూడాలని తాను నర్సింహస్వామిని ప్రార్థిస్తానన్నారు. పాపాత్ముడైన సీఎం రేవంత్ను క్షమించాలని […]Read More

Slider Telangana Top News Of Today

ఫామ్ హౌజ్ పై కేటీఆర్ క్లారిటీ

జన్వాడ ఫామ్ హౌజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి.. సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ది అని అధికార కాంగ్రెస్ కి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ ఫామ్ హౌజ్ ను కూల్చేయాలని ఇప్పటికే హైడ్రా నిర్ణయించింది కూడా.. తాజాగా ఈ ఫామ్ హౌజ్ గురించి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ నా పేరుపై ఎక్కడ కూడా ఏ ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ నాకు ‘తెలిసిన మిత్రుడి […]Read More

Slider Telangana Top News Of Today

Group-1 అభ్యర్థులకు అలెర్ట్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇది అలెర్ట్.. మెయిన్స్ పరీక్షల సమయంలో మార్పులు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్సీ)ఓ ప్రకటనను విడుదల చేసింది.. ఇంతకుముందు మెయిన్స్ పరీక్షలు మధ్యాహ్నాం 2.30నుండి సాయంత్రం 5.30 వరకు అని అప్పట్లో వెబ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఆ సమయం వేళలను మధ్యాహ్నాం 2.00గం.ల నుండి సాయంత్రం 5..00గం.ల వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ నెల 21నుండి అక్టోబర్ 27తారీఖు […]Read More

Breaking News Hyderabad Slider Telangana

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి పదిరోజుల అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను ముగించుకొని ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఇతర ఉన్నతాధికారులతో బృందంతో కల్సి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనున్నరు.Read More

Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి శాఖాలోనే నిరుద్యోగ యువతకు అన్యాయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పశుసంవర్ధక శాఖలో, పశువైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీల కోసం ఉద్యోగ పరీక్షలు నిర్వహించినా నియామకాలలో జాప్యం జరుగుతోంది.ఈ శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల (వీఏఎస్) నియామకానికి గత ఏడాది జులై 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.. ఏడాది దాటినా ఆ ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇందులో మామునూరు కళాశాలలో 11 అసోసియేట్ ప్రొఫెసర్లు, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిద్దిపేటలో ఒక డీన్, 18 […]Read More