Tags :telanganacm

Breaking News Slider Telangana Top News Of Today

SBI ఉద్యోగుల ఔదార్యం

తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి, రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ కి ప్రధాని మోదీ ఫోన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.. తక్షణ సహాయక చర్యలు చేపట్టాము.. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి […]Read More

Bhakti Breaking News Slider Telangana Top News Of Today

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ (Yadagirigutta Temple) బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (#SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై […]Read More

Slider Telangana Top News Of Today

నేడు జాతీయ క్రీడా దినోత్సవం

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. “నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం” అన్న ధ్యాన్ చంద్ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.., అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

SC వర్గీకరణపై కమిటీ

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీని నియమించి, ఆ రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు అభ్యర్థించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

“హైడ్రా ” ను స్వాగతించిన BRS MLA

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో కబ్జాదారులపై హైడ్రా చేస్తున్న చర్యలను కూల్చివేతలను స్వాగతిస్తున్నామని కూకట్పల్లి నియోజకవర్గ BRS MLA మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని భాగ్యనగర వాసిగా హరిస్తున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ లో చెరువులు, నాలాలపై రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను కలిపి ఓ నోడల్ అధికారిగాతో కమిటీ వేయాలని ఆయన కోరారు.Read More

Breaking News Editorial Slider Top News Of Today

బాబు ఎత్తుకు రేవంత్ రెడ్డి చిత్తు

తెలంగాణపై ఏపీ సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రూ.200000లు ఇస్తారా..?..లేదా..?-అంగన్‌వాడీల ఆవేదన

తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగ విరమణ పొందిన టీచర్లకు బెనిఫిట్స్‌ కిందరూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అప్పటి నుండి మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెనిఫిట్స్‌కు సంబంధించి ఎలాంటి జీవో విడుదల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళలకు ఫ్రీ బస్సు పై RTC కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హమీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెల్సిందే..ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. గత కొన్ని రోజులుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్లు దక్కక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ వ్యూహాత్మకంగా పాత రాజధాని ఏసీ బస్సులకు మార్పులు చేసి సెమీ డీలక్సులుగా నడుపుతోంది. వీటిల్లో మహిళలకు ఫ్రీ కాదు. ఎక్స్ ప్రెస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆ 4గురికి మంత్రి పదవులు..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఆ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే..ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై జాతీయ ఆధిష్టానంతో చర్చోపచర్చలు జరుపుతున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ సుదర్శన్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్ తో పాటు మరో ఇద్దరి పేర్లను  సూచించారని ఢిల్లీ పార్టీ […]Read More