దేశ వ్యాప్తంగా ఈ రోజు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్ లో దూసుకెళ్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ […]Read More
Tags :Telangana
తెలంగాణలో ఉన్న మొత్తం 17లోక్ సభ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఎన్నికల ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్,ఆదిలాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుందిన్Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More
జూన్ 2 తెలంగాణ ప్రజలందరూ తమకు వలస పాలకుల చెర నుండి విమూక్తి కలిగిన రోజు అని భావిస్తారు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణోళ్లందరూ ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్2 సందర్భంగా రాజధాని మహానగరంలో మెట్రో పిల్లర్లకు ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇచ్చింది.ఈ ప్రకటనను తెలియజేస్తూ హోర్డింగ్స్ కటౌట్లు నగరవ్యాప్తంగా వెలిశాయి. ఈ యాడ్ లో తెలంగాణ మ్యాప్ […]Read More
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ మూడు ఫీట్ల ఎత్తు లేనోడు కూడా బీఆర్ఎస్ ను అంతం చేస్తాము. .లేకుండా చేస్తామంటుండు. అలా అన్నవాళ్లే అడ్రస్ లేకుండా పోయారు అని అన్నారు. .ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ గురించే అన్నారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.Read More
‘ఆనాడు నా సలహాదారుగా, సహచరుడిగా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి మాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్. అయన అన్ని సందర్భాల్లో నాతోపాటు ఉండేవారు. ఆయన చాలా గొప్పవారు. కఠోరమైన సిద్ధాంతాలను నమ్మే పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చిందంటే దాన్ని పక్కనవెట్టి కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఆజన్మ తెలంగాణ వాది. 14, 15 ఏళ్లు నేను ఆయనతో కలిసి పనిచేసిన. ఆనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ వ్యథల గురించి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్‌ఎస్-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానపూర్ గ్రామంలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించుకోవడానికి గ్రామంలోకి వచ్చిన అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది.. తాము సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు లాక్కుంటున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.Read More
తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ తో సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్యే..మాజీ ఎంపీలపై కేసు నమోదు అయింది .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతం..చిహ్నాం మార్చాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. దీంతో వరంగల్ జిల్లా కేంద్రంలో కోట దగ్గర మీడియా సమావేశం నిర్వహించి, నిరసన తెలిపిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని […]Read More