ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పట్ల సామరస్యపూర్వకంగా వ్యవహరించాలి.. వారి వ్యక్తిగత జీవిత అంశాల్లోకి వెళ్లకూడదు. బాధితులు,జడ్జ్ ,న్యాయవాదుల ఫోన్ నంబర్లు,వారి ఫోటోలను పబ్లిసిటీ చేయద్దు. ఈ కేసులోని అంశాలను చాలా సున్నితంగా విచారించాలి అని వ్యాఖ్యనించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.Read More
Tags :telangana high court
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం….బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈరోజు సోమవారం కొట్టేసింది. గత పదేండ్లలో విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నియమ నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని, కేసీఆర్ పిటిషన్ కు విచారణార్హత లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.Read More
కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ జాప్యంపై ప్రభుత్వానికి హైకోర్టు అంక్షితలు
తన నియోజకవర్గమైన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుంది. లబ్ధిదారులకు సకాలంలో చెక్కులను అందజేయకపోతే వాటి గడవు ముగిస్తే ఏమి చేస్తారని ..తగిన వివరాలను అందజేయాలని అంక్షితలు వేస్తూ విచారణను బుధవారం రోజుకు వాయిదా వేసింది..Read More