Tags :telangana governament
తన నియోజకవర్గమైన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుంది. లబ్ధిదారులకు సకాలంలో చెక్కులను అందజేయకపోతే వాటి గడవు ముగిస్తే ఏమి చేస్తారని ..తగిన వివరాలను అందజేయాలని అంక్షితలు వేస్తూ విచారణను బుధవారం రోజుకు వాయిదా వేసింది..Read More
కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉన్న పాత 62.5 మెగా విద్యుత్ కేంద్రం స్థానంలో 800మెగావాట్ల అత్యాధునీక విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.. మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పార్టీ ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్,విజయరమణారావు,ప్రేమ్ సాగర్ రావు, విప్ లు ఆది శ్రీనివాస్,అడ్లూరి లక్ష్మణ్, డిప్యూటీ సీఎం భట్టిని కల్సి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భగా భట్టి మాట్లాడుతూ ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ఎన్టీపీసీ […]Read More
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో జూడాలు వరుసగా రెండో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు.. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని గాంధీ ఆస్పత్రిలో రెండు రోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె.. డ్యూటీలు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి మరి జూడాలు నినాదాలు . తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు తాము సమ్మె విరమించేది లేదని గాంధీ జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ ఈసందర్భంగా తెలిపారు.Read More
2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఎల్‌సీ మోడల్‌లో తెలంగాణకు 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు వారి సొంత స్థలాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిని బంజారాహీల్స్ లో ముఖ్యమంత్రి నివాసంలో పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు కలిశారు.. ఈ సందర్భంగా గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్‌గ్రెడేషన్ సమస్యను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు కల్పించినందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డితో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులు..నేతలు ఇసుక దందా చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఇసుక ట్రాక్టర్ల ఆగడాలు భరించలేక పట్టుకుని రాచర్లబొప్పాపూర్ గ్రామస్థుల పోలీసులకు పట్టించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది..Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని అల్వాల్ తన నివాసంలో ఆమె ఉరివేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే రూపాదేవి ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ వెనక ఉన్న గల కారణాలపై విచారణ చేపట్టారు.Read More
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కొల్చారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ.. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు.Read More
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన సచివాలయంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. హైదరాబాద్ వివిధ రంగాల్లో విస్తరిస్తూ గ్లోబల్ సిటీగా వృద్ధి చెందుతున్న తీరును సమావేశంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తమ అధ్యయన వివరాలను వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో హైదరాబాద్‌లో లీజింగ్, ఆఫీస్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట, శ్రీశ్రీనగర్, రాజరాజేశ్వర కాలనీ, కాకతీయ కాలనీ, తోళ్లవాగు ఏరియా, సున్నంబట్టి వాడ (మంచిర్యాల టౌన్-3)లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కరెంట్ పోయి ఎంత సేపైనా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ఆయా ప్రాంతాల వాసులు ట్రాన్స్‌కో ఏఈ నర్సయ్యకు ఫోన్ చేయగా.. సమస్య ఏంటో తెలియడం లేదని సమాధానం చెప్పినట్టు సమాచారం.. నెల రోజులుగా రోజూ తమ ప్రాంతాల్లో కరెంట్ పోతుందంటూ కాలనీల వాసులు వాపోతున్నారు.Read More