Tags :telangana governament

Blog

పీఎం ఇవ్వడు..ఈ సీఎం ఇవ్వడు..

తెలంగాణ ప్రభుత్వం తీసుకోచ్చిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూరుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది.కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారం లోకి వచ్చాక మాట తప్పారు అని అన్నారు..ఆయన ఇంకా […]Read More

Slider Telangana

ఆత్మహత్య చేసుకున్న రైతుకు అండగా బీఆర్ఎస్

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం..బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాలతో మృతి చెందిన రైతు బోజేడ్ల ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ ని కలిసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధుల బృందం… ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం రైతు బోజేడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని మృతిని కుటుంబానికి సర్వత న్యాయం చేయాలని […]Read More

Slider Telangana Top News Of Today Videos

మళ్ళీ అధికారం బీఆర్ఎస్ దే

రెండున్నర దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని, ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల […]Read More

Slider Telangana Top News Of Today

సరికొత్తగా హైడ్రా

హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు అనుగుణంగా వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు. ఇకనుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు మార్చాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు. […]Read More

Slider Telangana Top News Of Today

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరోకసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ…నూతన పీసీసీ అధ్యక్ష నియామకాల గురించి చర్చించడానికి వెళ్లనున్నారు అని గాంధీ భవన్ వర్గాల ఇన్నర్ టాక్.. అదే విధంగా ఈ నెల 22 తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తెలంగాణకు ఎక్కువగా నిధులు కేటాయించాలని కోరనున్నట్లు కూడా సమాచారం..Read More

Slider Telangana Top News Of Today

గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత

గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆయన కు మద్ధతుగా ఆసుపత్రి ప్రాంగాణంలో ఉన్న నిరుద్యోగ యువత..విద్యార్థులను పోలీసులు తరిమికొట్టారు.. దీంతో వాళ్లంతా దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ లోకి పరుగులు తీశారు..Read More

Slider Telangana

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా స్కూళ్లల్లో  టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనున్నట్లు తెలుస్తుంది..Read More

Slider Telangana

నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం

తెలంగాణ లోని గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్ లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంకట్ తెలిపారు. నిన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో బల్మూరి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.Read More

Editorial Slider Telangana Top News Of Today

6అబద్ధాలు..30వేల కోట్ల అప్పులుగా రేవంత్ 6నెలల పాలన

ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో  ఆరు అబద్ధాలుగా ..ముప్పై వేల కోట్ల అప్పులుగా కొనసాగుతుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..అధికారంలోకి వస్తే ఆసరా ఫించన్ నాలుగు వేలు ఇస్తాము..ప్రతి మహిళకి రెండు వేల ఐదోందలు ఇస్తాము..ఆడబిడ్డపెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం . రైతుబంధు కింద పదిహేను వేలు..రైతుభరోసా కింద పన్నెండు వేలు..డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేస్తాము..జాబ్ క్యాలెండర్..రెండు లక్షల సర్కారు కొలువులిస్తాము. […]Read More

Slider Telangana Top News Of Today

జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో  ఉండనున్నట్లు గాంధీభవన్ లో వినికిడి. ప్రస్తుతం మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్,రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్, రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్ మంత్రి పదవుల రేసులో ఉన్నట్లు టాక్.ఇటీవల పార్టీపై నిరసన గళం విన్పిస్తున్న […]Read More