తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కి అసమ్మతి సెగ తగిలింది. దాదాపు 14మంది డైరెక్టర్లు చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ పద్నాలుగు మంది డైరెక్టర్లు డీసీఓను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సంగతి తెల్సిందే.Read More
Tags :telangana ex minister
తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన […]Read More
తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం నెలకొన్నది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు.Read More
ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు . చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడు.ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో […]Read More
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ 108ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. దీంతో ఈరోజు సాయంత్రం ఆయన మాజీ మంత్రి హారీష్ రావును కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల రోజున మహబూబ్ నగర్ ప్రజలు నవీన్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి బహుమతిగా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అమెరికాకు వెళ్లింది ఫోన్ ట్యాపింగ్ నిందితులను కలవడానికి..నా దగ్గర రుజువులున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ “మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది.ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది […]Read More
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ మూడు ఫీట్ల ఎత్తు లేనోడు కూడా బీఆర్ఎస్ ను అంతం చేస్తాము. .లేకుండా చేస్తామంటుండు. అలా అన్నవాళ్లే అడ్రస్ లేకుండా పోయారు అని అన్నారు. .ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ గురించే అన్నారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.Read More