Tags :telangana cm

Slider Telangana

రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డితో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఈరోజు సోమవారం భేటీ అయ్యారు.. నగరంలోని జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన సమావేశమయ్యారు.. ఎమ్మెల్సీ చల్లా పార్టీ మారతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం విశేషం..Read More

Slider Telangana

మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు(ఆదివారం) హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. టీచర్లు, పుస్తకాలు, దుస్తుల కొరత, వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని అన్నారు. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు […]Read More

Andhra Pradesh Editorial Slider

బాబు స్వీట్ వార్నింగ్

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇక్కడ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్నారు. పక్క రాష్ట్రంతో […]Read More

Slider Telangana Top News Of Today

మంత్రివర్గ విస్తరణలో ట్విస్ట్-అనూహ్యంగా BRS MLA కి చోటు

జూలై నాలుగో తారీఖున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నది అని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి..నిన్న మొన్నటివరకు హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డికి అవకాశమున్నదని సాక్షాత్తు మంత్రి దామోదర రాజనర్సింహా మీడియాతో తెలిపారు.. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు సనత్ నగర్ ఎమ్మెల్యే..మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..ఈ మొత్తం ఎపిసోడ్ లో యూపీ మాజీ ముఖ్యమంత్రి..ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ […]Read More

Slider Telangana Top News Of Today

సరికొత్తగా హైడ్రా

హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు అనుగుణంగా వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు. ఇకనుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు మార్చాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు. […]Read More

Slider Telangana Top News Of Today

ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది.. అందులో భాగంగా రేపు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు..నిన్న సోమవారం గవర్నర్‌తో సీఎం సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సంగతి కూడా తెల్సిందే.. కేబినెట్‌ విస్తరణతో పాటు శాఖల మార్పుఇప్పటికే అధిష్ఠానంతో రేవంత్‌ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది..రేపు ఢిల్లీలో ఫైనల్‌ లిస్ట్‌పై కసరత్తుతో పాటుఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల గురించి చర్చించనున్నారు..Read More

Slider Telangana Top News Of Today

మోతీలాల్ నాయక్ దీక్ష విరమణ

గత తొమ్మిది రోజులుగా అమరణ నిరాహర దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించాడు..ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ “గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో చెప్పారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టిన […]Read More

Slider Telangana

మంత్రి అనుచరుల ఆగడాలతో వీడియో తీసుకుంటూ రైతు ఆత్మహత్య

రైతు రాజ్యం వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వేస్తే నా పొలం ఆక్రమించుకొని నాకు అన్యాయం చేస్తున్నారని మ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు భోజడ్ల ప్రభాకర్ తీవ్ర మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి. నేను చనిపోతున్న.. నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.. డిప్యూటీ సీఎం బట్టి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ ఖమ్మం జిల్లా టీడీపీ కార్యర్త, ఓ రైతు ఆత్మహత్య. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ […]Read More

Slider Telangana Top News Of Today

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరోకసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ…నూతన పీసీసీ అధ్యక్ష నియామకాల గురించి చర్చించడానికి వెళ్లనున్నారు అని గాంధీ భవన్ వర్గాల ఇన్నర్ టాక్.. అదే విధంగా ఈ నెల 22 తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తెలంగాణకు ఎక్కువగా నిధులు కేటాయించాలని కోరనున్నట్లు కూడా సమాచారం..Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…!

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుండి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా మున్సీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ […]Read More