ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు..ఈ నిర్ణయంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.Read More
Tags :tdpgovernament
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రంలోని పల్నాడు లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 31న పల్నాడు జిల్లాలోని యల్లమంద లోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.. ఆ రోజు ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో ముఖాముఖి కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు… ఈ కార్యక్రమం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు..ఆ తర్వాత రోజు మ.1:45 గంటలకు కోటప్పకొండకు చేరుకొని త్రికోటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు..Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అగంతకుడి నుండి బెదిరింపు కాల్స్ వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది..ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి.. పవన్ కళ్యాన్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి ఫోన్ కాల్స్ రావడంతో అంత ఉలిక్కిపడ్డారు. పవన్‌ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మెసేజులు కార్యాలయానికి వచ్చాయి.. దీంతో సిబ్బంది డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తన గురించి వచ్చిన బెదిరింపు కాల్స్‌పై పోలీస్ […]Read More
ఏపీలో గత వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని ఆ పార్టీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.Read More
నవ్యాంద్ర లో గత ఐదేండ్లు అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి.. నగరి మాజీ శాసనసభ్యులు ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాధికారులకు వార్నింగ్ ఇచ్చారు.వరదల విపత్తు సమయంలో అధికారులు ఎవరూ సరిగా పనిచేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలే.. అత్యవసర పరిస్థితుల్లో అధికారులంతా.. వ్యవస్థలన్నీ సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సరిగ్గా పనిచేయకపోతే తాను సహించేది లేదని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. ఈరోజే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశాను. ఐదేళ్ళుంగా అధికార వ్యవస్థలేవి సరిగా పని చేయలేదు. ముందు నుండి […]Read More
ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. పలు ఇండ్లపై కొండ చరియలు విరిగిపడటంతో పలువురు శిధిలాల్లో చిక్కుకుని ఉన్నారు. అయితే తొలుత మేఘన అనే యువతి చనిపోగా ఆ తర్వాత మరో 4గురు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోవడం చాలా బాధాకరం .. వారికి అండగా ఉంటాము. […]Read More
ఏపీలో విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తరవాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్, ఒకవేళ ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా […]Read More
ఏపీలో పోలీసు ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర హోం మంత్రి అనిత శుభవార్తను తెలిపారు. త్వరలోనే ఇరవై వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది పోలీసులు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఐదేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలకు ముందు ఉద్యోగాల జాతర అంటూ ఎన్నికల స్టంట్ చేసింది. దీనిపై హైకోర్టులో పిటిష న్ కూడా దాఖలైంది. పోలీసులకు సౌకర్యాలు కల్పించి […]Read More