ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
Tags :TDP
కేంద్రమంత్రి..సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని హైదరాబాద్ లోని వారి నివాసంలో ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు…నరసాపురం బీజేపీ టీడీపీ జనసేన ఎంపీ క్యాండిడేట్ భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ వర్మ)కలిశారు.. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించుకున్నారు..తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడుకున్నారు.Read More
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే… జూన్ నాలుగో తారీఖున విడుదల కానున్న లోక్ సభ ఎన్నికల ఫలితాల గురించి కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి మూడు వందలు.. బీజేపీ కూటమికి రెండోందల సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. తమ కూటమి […]Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.. చంద్రబాబు కు 12*12ఎస్పీజీ వైట్ కమాండోలతో కూడిన భద్రత సిబ్బందితో రక్షణ కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులల్లో పేర్కోంది. అయితే రెండు షిప్ట్ లుగా వీళ్లు పని చేయనున్నట్లు తెలుస్తుంది.. ఎన్నికల అయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..ఒకపక్క ఈ ఎన్నికల్లో తమదే గెలుపంటూ ఇరుపక్షాలు సవాళ్ల మీద సవాళ్లు చేసుకుంటున్నారు..Read More
ప్రముఖ ఎన్నికల వ్యూహా కర్త అయిన ప్రశాంత్ కిషోర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేసిన ఐప్యాక్ టీమ్ సభ్యులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ వైసీపీ కోసం ప్రశాంత్ కిషోర్ చేసిందేమీ లేదు.. చేసేదంతా ఐప్యాక్ టీమే. ప్రశాంత్ కిషోర్ మనకు వ్యతిరేకంగా మారారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించని ఫలితాలు వస్తాయి.. గతంలో […]Read More
ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం… దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. గత నెల ముప్పై తారీఖున పిఠాపురం లో జరిగిన సభ తర్వాత పవన్ కళ్యాణ్ నీరసపడినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో పవన్ అక్కడ నుండి స్పెషల్ హెలికాప్టర్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన వైద్యపరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం.. మరోవైపు పవన్ […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకపక్క సీట్లు రావడం లేదు అని కొంతమంది ఆ పార్టీకి దూరంగా ఉంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరో పక్క ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. వైజాగ్ జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం లో నిర్వహించిన పార్టీ విస్తృత […]Read More
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఓ కొలిక్కి రాకముందే తాజాగా ఏపీలో అది సంచలనం రేకెత్తిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ..మాజీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు మా పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుంది. నేను మా పార్టీకి చెందిన నేతలతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బీఫ్ అనే శబ్ధం వస్తుంది. […]Read More