ఏపీ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని అధికార తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ […]Read More
Tags :TDP
మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఎలాంటి రాజ్యాంగ సవరణలు లేకుండా ఆమోదం పొందితే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయనే అంశంపై న్యాయనిపుణులతో చర్చ జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 కు చేర్చిన సవరణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్ సభ మొదటి సిటింగ్ జరిగే రోజు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ విడుదలయ్యే రోజు లేదా తేదీని […]Read More
ఏపీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీ తరపున రాజ్యసభకి పోటి చేసే సభ్యులను ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.. రాజ్యసభకు బరిలో దిగే అభ్యర్థులుగా సానా సతీష్,బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది.. మరోవైపు బీసీ నేత ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకపోవడంతో జనసేన […]Read More
టీడీపీ కార్యకర్త ఆత్మహత్య – రాజకీయ పార్టీలకు ఓ గుణపాఠం..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన శ్రీను అనే కార్యకర్త తనకున్న ఆర్థిక,కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనం సృష్టిస్తుంది. రాజకీయ పార్టీకి అది అధికార పార్టీకి చెందిన కార్యకర్త అది కూడా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడటం యావత్ రాజకీయ పార్టీలు ఓ గుణపాఠాన్ని నేర్చుకోవాలి. చనిపోయిన శ్రీను అనే కార్యకర్త సామాన్య కార్యకర్తనే కాదు. ఏకంగా తనతో పాటు తన చుట్టూ ఉన్న వారి సమస్యలను నేరుగా మంత్రి లోకేష్ […]Read More
అభిమాని ఆత్మహత్య – మంత్రి లోకేష్ సమాధానం ఇదే..!
ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు అభిమాని శ్రీను అనే టీడీపీకి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. తనకు ఉన్న ఆర్థిక సమస్యలతో .. కుటుంబ సమస్యలతో శ్రీను ఆత్మహత్య చేసుకోవడంపై మంత్రి లోకేష్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” ఎప్పుడూ అన్నా అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టమోచ్చిన వాళ్లకు సాయం చేయాలని నాకు మెసేజ్ చేసేవాడివి. నా పుట్టిన రోజు.. […]Read More
ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నందున మెజార్టీ దేశాల్లో ఉన్నట్టుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకెళ్లకూడదని వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు విజయవంతంగా కూడా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రాథమిక హక్కయిన వాక్స్వాతంత్ర్యాన్ని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరమన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ దార్శనికతను ఆయన కొనియాడారు.ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందిస్తూ వైసీపీ 151సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై అనుమానం లేదా..?.గతం మరిచి […]Read More
ప్రభాస్ తో రిలేషన్ వార్తలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఎదో సంబంధం ఉందంటూ అనేక చర్చలు, వార్తలు వినిపిస్తూనే ఇప్పటికి ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల ఈ వార్తలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు సృష్టించిందో ఎవరో, ప్రచారం చేసింది ఎవరో తనకి తెలుసు అంటూ క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ “నా మీద టీడీపీ ఎమ్మెల్యే.. హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు […]Read More
ఏపీలో గత వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని ఆ పార్టీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే వైసీపీకి బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.గత ఎన్నికల్లో కూటమి కి 164స్థానాలు… వైసీపీ కి పదకొండు స్థానాలు వఛ్చిన సంగతి […]Read More
ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొన్నది. ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనమండలి సమావేశాల్లో మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ,కూటమి పార్టీల మధ్య రగడ మొదలైంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమా..? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి హాజ్ యాత్రకు వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. దీంతో హాజ్ యాత్రను ప్రస్తావించడంపై వైసీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీంతో […]Read More