Tags :tdp governament

Andhra Pradesh Slider

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో […]Read More

Andhra Pradesh Slider

ఈనెల 22నుండి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 22నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయించింది.. అంతేకాకుండా పంటల భీమా పథకానికి ప్రీమియమ్ చెల్లింపు విధివిధానాలపై ఆధ్యాయనానికి కమిటీ వేయాలని నిర్ణయించారు.. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలి..ఈ సెషన్లోనే ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రవేశపెట్టాలా..వద్దా..? ..తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు పెట్టాలి ఇలా అనేక  అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం చర్చించింది. ఈ రోజు సాయంత్రం […]Read More

Andhra Pradesh Slider

రూ 15000లపై బాబు సర్కారు క్లారిటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకంపై  ఉత్తర్వులు విడుదల చేసింది. దీనిప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను సర్కారు పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేల సాయం అందిస్తామని ఆ జీవోలో పేర్కొంది. అయితే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది.Read More

Andhra Pradesh Slider

ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల పదహారు తారీఖున ఏపీ క్యాబినెట్ సమావేశం కానున్నది. ఈ భేటీకి అమరావతిలోని ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌లో హాలు వేదిక కానుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. ఆ రోజు మధ్యాహ్నాం 01:30 గం.ల వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై సుదీర్ఘ చర్చ జరగనున్నదని సమాచారం.Read More

Andhra Pradesh Slider

బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం

నేడు  అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో టీడీపీ చీఫ్  సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరగనున్నది… బాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది .. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు .. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం..Read More

Andhra Pradesh Slider Telangana

బాబు రేవంత్ భేటీ అంశాలపై క్లారిటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు.. అది మీడియా ఊహాగానం మాత్రమే అని మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రుల బృందం క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో డ్రగ్స్ & సైబర్ నేరాల గురించి మాత్రమే చర్చలు జరిగాయి. టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు. రెండు రాష్ట్రాల […]Read More

Andhra Pradesh Slider

That Is పవన్ కళ్యాణ్

ఏపీలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమవరానికి చెందిన యువతి తప్పిపోయి 9 నెలలు అయిన దొరకలేదు..,కానీ తమ పాలనలో 9 రోజుల్లోనే కేసు ఛేదించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘గత ప్రభుత్వం మహిళల మిస్సింగ్పై నిర్లక్ష్యం వహించింది. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ఎవరూ పట్టించుకోలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై యువత, ప్రజలు విసిగిపోయారు. రక్తం చిందించకుండా అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.Read More

Andhra Pradesh Slider

ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ రాత్రికి రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీల విందులో పాల్గొననున్నారు. రేపు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలతో అయన భేటీ కానున్నారు. అమరావతి, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు.Read More

Andhra Pradesh Slider Top News Of Today

టూరిజం అభివృద్ధి చేస్తాం

ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అల్లూరి జిల్లా  దేవీపట్నంలో పర్యటించారు.. ఈ పర్యటనలో భాగంగా పాపికొండల పర్యాటక బోట్లను పరిశీలించారు.. ఫిట్‌నెస్ లేని బోట్లపై మంత్రి కందుల దుర్గేష్‌ ఆరా తీసి ఏపీలో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీచ్చారు… అంతే కాకుండా  బోట్ పాయింట్ దగ్గర కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేస్తాము…పర్యాటకుల రద్దీ మేరకు బోట్ల సంఖ్యను పెంచుతామని మంత్రి తెలిపారు..Read More

Andhra Pradesh Slider Top News Of Today

పెనుమాకలో చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెనుమాకలో  రేపు సోమవారం పర్యటించనున్నారు. రేపు ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకుంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా సీఎం పెన్షన్లు పంపిణీ చేస్తారు. తదనంతరం పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో బాబు ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి అయన చేరుకుంటారు.Read More