గత తొమ్మిది రోజులుగా అమరణ నిరాహర దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించాడు..ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ “గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో చెప్పారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టిన […]Read More
Tags :strike
ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సాగు సమయం వచ్చినప్పటికీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏడాది ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలను పంపిణీ చేసేది. కాగా ఈ ఏడాది రైతులు సాగుకు శ్రీకారం చుట్టి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.Read More
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు మద్దతుగా గురువారం బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే… వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస పెడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి, వానకు తడుస్తుంటే పట్టించుకోని సర్కారు తీరు చూసి గుండెమండిన అన్నదాతలు బుధవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ధాన్యం కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు. […]Read More