ఏపీలో ఈరోజు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఘోర ఓటమిని కట్టబెట్టడంపై వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. గత ఐదేండ్లలో తమ ప్రభుత్వం తరపున అమ్మఒడి డబ్బులు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినా, అవ్వాతాతలకు ఇంటివద్దకే పెన్షన్ పంపినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కోటి మందికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వారు ఆప్యాయత చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల […]Read More
Tags :slider
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని చెప్పారు. మళ్లీ త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుదన్న నమ్మకం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన 24 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీకి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన […]Read More
ఈరోజు విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలను నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం. ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ […]Read More
పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసేవాళ్లనే ఓటర్లు ఓడించే రోజులు ఇవి. అలాంటిది పదవుల్లో ఉన్నామనో.. అధికారంలో ఉన్నామనో.. లేదా తాము మంత్రులమనో విర్రవీగుతూ బూతుల పురాణం చదివితే టైం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారనడానికి ఏపీలో తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల సంఘటనలను చూస్తే ఆర్ధమవుతుంది. గత ఐదేండ్లలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, అంబటి రాంబాబు,సీదిరి అప్పలరాజు,జోగి రమేష్ లతో పాటు అనిల్ […]Read More
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతుంది.ఇప్పటివరకు కూటమి 163స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు 19ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నరు. రాష్ట్రంలో పిఠాపురం అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో పవన్‌కల్యాణ్ గెలుపొందారుRead More
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగలింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న సీఎం..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కేవలం 12 సీట్ల వద్దనే ఆ పార్టీ ఆగిపోయింది. వీటిలో కూడా ఒకటి రెండు సీట్లు కూడా ఎన్డీయే కూటమికే వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటును […]Read More
ఈరోజు విడుదలవుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 162స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్తుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఖాయమైనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. జూన్ తొమ్మిదో తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది.Read More
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటి కాదని సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో […]Read More
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుండి బరిలో దిగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి 22,674 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 1,04,227 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లు వచ్చాయి.. మరోవైపు షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.Read More