ఏపీ హోం మంత్రిగా మహిళ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల విడుదలైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు . పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్లో సీనియార్టీ, ఎస్సీ వర్గ సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు.Read More
Tags :slider
ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడుని మార్చారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా 95,235 వేలకుపైగా మెజారిటీతో వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా శ్రీనివాస్ ఎంపికయ్యారు.Read More
ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేనానికి పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు నారా లోకేష్ కు రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..Read More
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆదరణ లభిస్తుంది. సకల వసతులతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఈ స్కూల్‌లో సీటు కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు.1200 మంది విద్యార్థుల చదువుకోవడానికి అవకాశం ఉన్న ఈ స్కూల్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 600 మంది […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో ఐదు పైల్స్ పై సంతకాలు చేశారు. అయితే సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఉన్నతాధికారులకు షాకిచ్చారు చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ చరిత్రకెక్కనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు. దీని ద్వారా మాజీ ఆర్థిక శాఖమంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలా సీతారామన్ తిరగరాస్తారు. వీరిద్దరూ ఐదు పూర్తి స్థాయి, ఒకటి మధ్యంతర బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు. మరోవైపు ఈనెల 24నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. జులైలో బడ్జెట్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. దీంతో సీఎం చంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరో రోహిత్ నారా తన పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తూ ఓ లేఖను ట్విట్టర్లో పోస్టు చేశాడు.. ఆ లేఖ గురించి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ “‘ప్రియమైన నారా రోహిత్, నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో…యంగ్ రెబల్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి. ఈ నెల 27న విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు వేగవంతం చేసేందుకు ‘కల్కి’ టీమ్ సరికొత్త శ్రీకారం చుట్టింది. ఇందుకు LED స్క్రీన్లు ఏర్పాటు చేసిన వాహనాలను ఎంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కల్కి టీమ్ పంచుకుంది. దేశమంతా వెలుగును పంచే యాత్ర ప్రారంభమవుతుందని ట్వీట్ చేసింది. దీంతో కల్కి కాన్వాయ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి కమీటీలు వేసిన జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ పార్టీ శ్రేణుల […]Read More