తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More
Tags :slider
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం నెలకొన్నది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు.Read More
ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More
న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టుపై గెలిచిన భారత్ వరల్డ్ కప్ టోర్నిలో ఒకే జట్టు(పాక్)పై అత్యధికసార్లు(7) గెలిచిన జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్పై పాక్, విండీస్ జట్లపై శ్రీలంక చెరో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్ […]Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164స్థానాల్లో.. అధికార వైసీపీ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు అయ్యారు. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు జనసేనాని తన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న ఆదివారం […]Read More
తెలంగాణలో ఫించన్ దారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను […]Read More
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలోని ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అన్ వ్యక్తి పలువురితో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టాడు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164స్థానాలు.. వైసీపీ పదకొండు స్థానాల్లోనే మాత్రమే గెలుపొందింది. దీంతో వైసీపీ ఓడిపోవడంతో వేణు గోపాల్ రెడ్డి తన ఊరు.. ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.. అతనికి ఎంతగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు […]Read More
న్యూయార్క్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లలో రిషభ్ పంత్(42) మినహా ఒక్కరంటే ఒక్కరు దాయదీ జటు బౌలర్లను దీటుగా ఎదుర్కొని నిలబడలేకపోయారు. బ్యాటింగ్ యూనిట్ వైఫల్యంతో టీమిండియా 119 పరుగులకే ఆలౌటయ్యింది. న్యూయార్క్ పిచ్‌పై పాక్ బౌలర్లు నసీం షా(3/21), హ్యారిస్ రవుఫ్(3/21)లు రెచ్చిపోయారు. 120పరుగు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు ఆరు ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పొయి […]Read More
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More