త్వరగా నిద్రపోయేందుకు ఇటీవల చాలామంది మిలిటరీ మెథడ్ ఫాలో అవుతున్నారు. తక్కువ సమయంలో నిద్రకు సైనికులు పాటించే ఈ విధానంతో 10 సెకన్లలోనే నిద్ర వస్తుందట. పడుకుని ముఖంలోని కండరాలతో పాటు భుజాలు, చేతులు, కాళ్లు సహా శరీరాన్నంతా వదులుగా ఉంచాలి. దీర్ఘ శ్వాసలతో పది సెకన్ల పాటు ప్రశాంత ఘటనను ఆలోచిస్తూ కళ్లు మూసుకోవాలి. ఒకవేళ నిద్ర రాలేదంటే మనసులోకి వచ్చే ఆలోచనలను ‘ ఆలోచించకు’ అని ఆపేస్తూ తిరిగి ప్రయత్నించాలి. ఒక్కసారి ఈ టెక్నిక్ […]Read More
Tags :sleeping
మాములుగా మనం కంటికి సరిపడా నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తే, అతి నిద్ర పలు రోగాలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ 8-9 గంటల కంటే ఎక్కువగా పడుకుంటే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఊబకాయానికి దారి తీయడంతో పాటు గుండెజబ్బులు వస్తాయి. ఒత్తిడికి లోనై చిన్నచిన్న విషయాలకూ కోపం వస్తుంది. తల, వెన్నునొప్పి, కీళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. ఈ మార్పులు వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తాయి.Read More
చలికాలంలో మిగతా కాలాలతో పోలిస్తే సహాజంగా అందరికీ మూత్రం ఎక్కువగా వస్తుంది. పగలు సంగతి ఎలా ఉన్న కానీ రాత్రిళ్లు మూత్రం వచ్చినా నిద్రకి భంగం అవుతుందని చాలా మంది బద్ధకిస్తారు. ఇది ప్రమాదకరమని, బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రం ఎక్కువ సమయం ఆపితే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనమవుతాయని, కాలక్రమేణా మూత్రాశయం పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. మూత్రం రాగానే పాస్ చేయాలని సూచిస్తున్నారు.Read More