Tags :singidinews

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్..?

తెలంగాణలో గత పది నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వానాకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదు. రూ.15వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం పండిన పంటను కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి చిట్టినాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్ బిజీబిజీగా ఉన్నాడు’ అని రైతు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం

ఏపీ అధికార టీడీపీ కి చెందిన నరసరావుపేట  జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు తన అనుచరులతో కలిసి, నిన్న రాత్రి వినుకొండ రోడ్డులోని ఒక బార్లో మద్యం తాగాడు. అయితే బిల్లు చెల్లించమని అడిగినందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి, నిర్వాహకులపై దాడి చేశాడు. ఈ ఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

హైదరాబాద్ లో దీపావళి వేడుకలపై అంక్షలు

హైదరాబాద్ మహానగరంలో దీపావళి వేడుకలపై సైబరాబాద్ పోలీసు శాఖ అంక్షలను విధిస్తూ ఓ ఉత్తర్వులను జారీ చేసింది..ఇందులో భాగంగా ఈరోజు నుండి నవంబర్ రెండో తారీఖు వరకు ఈ అంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ  ఉత్తర్వుల ప్రకారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి ఉత్సవాల సమయంలో రోడ్లమీద పటాకులు పేల్చడం నిషేధం.రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కాలుష్య నియంత్రణ మండలి పరిమితులకు లోబడి పటాకులు పేల్చాలి. ఈ ఆదేశాలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి బెదిరింపులు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేకి ఓ అగంతక వ్యక్తి నుండి బెదిరింపులు ఎదురయ్యాయి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు ఓ అగంతక వ్యక్తి కాల్ చేశాడు..కాల్ చేసి తక్షణమే ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు..కేసు నమోదు చేస్కున్న పోలీసులు సదరు వ్యక్తిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు..Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీపావళి కానుకను అందించింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెల్సిందే.. దీంతో ఆ డీఏ 3.64%ఇస్తున్నట్లు ఆదేశాలను జారీ చేసింది.. పెంచిన డీఏ జూలై 1,2022నుండి వర్తింపు ఉంటుంది అని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కోన్నది..Read More

Breaking News Slider Telangana Top News Of Today

”నంద‌నవ‌నం” ఆక్ర‌మ‌ణ‌దారుల తొల‌గింపున‌కు ఆదేశం

రంగారెడ్డి జిల్లా ఎల్. బి. న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నంద‌న‌వ‌నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌వారిని త‌క్ష‌ణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాల‌ని రెవెన్యూ. హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రివ‌ర్యులు శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం స‌చివాల‌యంలో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని మంకాల్, నంద‌న‌వ‌నంలో ఉన్న ఇండ్ల స‌మ‌స్య‌, కేటాయింపుపై అధికారుల‌తో మంత్రిగారు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో హౌసింగ్ సెక్ర‌ట‌రీ జ్యోతి బుద్ధ‌ప్ర‌కాష్‌, ప్ర‌జావాణి నోడ‌ల్ ఆఫీస‌ర్ డి. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైజాగ్ విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం..

ఏపీలో విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులను విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ సందర్భంగా ఇండిగో విమాన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను కేంద్ర మంత్రి అందజేశారు.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌ సర్వీసెస్ వర్సిటీ ఏర్పాటు చేశారు .. విశాఖ నుంచి ఎయిర్‌ కనెక్టివిటీకి కృషి చేస్తున్నాము . భోగాపురం ఎయిర్‌పోర్ట్ బ్రైట్ స్పాట్‌గా మారుతుంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

జీవన్‌రెడ్డి సంచలన ఆరోపణలు!!

తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత..ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని, పోచారం శ్రీనివాసరెడ్డి ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ నాయకుల అరాచకాలపై పోరాడానని, ఇప్పుడు అదే నాయకులు పార్టీలో చేరి కాంగ్రెస్‌ కార్యకర్తలపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అశోక్ నగర్ లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు….

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై వివాదం నెలకొన్నవేళ ప్రభుత్వం కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షలను వాయిదా వేయాలని, రీషెడ్యూల్ చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటు..కోర్టులో గ్రూప్-1 బాధితుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అభ్యర్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

త్వరలో అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ 1″

తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చుతాము.. అందుకోసం హైదరాబాద్ ఎకానమీని 600 మిలియన్ డాలర్లుగా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడారు.ధైర్యం, త్యాగాలే నాయకత్వంలో ముఖ్య లక్ష్యణాలు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మహాత్మాగాంధీ, పండిత్ జవహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వారు గొప్ప […]Read More