తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ (#YTPS)కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 […]Read More
Tags :singidinews
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి త్రివర్ణ పతాక స్టిక్కర్‌ను అందించారు. యుద్దంలో గాయపడిన వీర సైనికుల పునరావాసం, వారి కుటుంబాల సంక్షేమం, పునర్నివాసం వంటి కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మంచి పనైనా చేశారా అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నించారు. గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హారీష్ రావు మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ‘పోలీసులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సీఎం రేవంత్ ఆదేశాల ప్రకారం పని చేయకూడదు. ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతులను నొక్కాలని ప్రభుత్వం చూస్తోంది’ అని […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శ్రీనులో హీరోయిన్ గా అందాల రాక్షసి..సీనియర్ నటి సమంత నటించిన సంగతి తెల్సిందే.. ఈ చిత్రం నిర్మాణ సమయంలో సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘చికిత్సకు సమంతకు అవసరమైన డబ్బులు నిర్మాతలెవరూ ఇవ్వలేదు. ఆ సమయంలో నేను రూ.25 లక్షలు ఇచ్చాను. ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యేదాకా […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు బిగ్ షాకిచ్చారు..ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ చర్యలకు అనుగుణంగా మహానగరంలో డీజిల్ ఆటోలను నగరం వెలుపల ఉన్న ఓఆర్ఆర్ బయటకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రిత్వ,అధికారులకు సూచించారు. అయితే వారు ఎలక్ట్రిక్ ఆటోలు […]Read More
ఈ నెల 9 వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు గారితో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఆహ్వానం అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 7, 8, […]Read More
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.స్వయం సహాయక సంఘాల కోసం నగరం నడిబొడ్డులోని శిల్పారామంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను గవర్నర్ గారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి , ఉప […]Read More
ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి
హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి జూపల్లికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫించన్లు, రెవెన్యూ, తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి జూపల్లి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో […]Read More
ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు బంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” కేవలం వార్తలు, వృత్తే కాకుండా […]Read More