పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవుతుందని , ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు.విద్యార్థులను చూస్తుంటే నా […]Read More
Tags :singidinews
ధరణి పోర్టల్ ఇక ‘భూ భారతి’గా మారనుంది. అలాగే ప్రతి కమతానికి ఒక భూధార్ నంబర్‌ను జీయో రిఫరెన్సింగ్ ఇవ్వనున్నారు. తొలుత టెంపరరీ.. ఆ తరువాత పర్మినెంట్ భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ప్రైవేట్ ఏజెన్సీ టెర్రాసిస్ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అప్పగించింది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. […]Read More
శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి […]Read More
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతి గారికి స్వాగతం పలికారు.రాష్ట్రపతికి స్వాగతం పలికినవారిలో మంత్రి సీతక్క , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తాతో పాటు త్రివిధ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను అసెంబ్లీలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం (TGSCO) ద్వారా తయారు చేయించి ఏడాదికి రెండు చీరల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వాటి నమూనాలను సీఎం పరిశీలించారు. […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More
చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన గ్రూప్ 2 పరీక్షలో 2009లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు ఇచ్చింది సరైందా? కాదా?.రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, టి సుబ్బరామి రెడ్డి, కావూరి సాంబశివరావు కంపెనీలు ఏమిటో గుర్తించండి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా […]Read More
రాబోయే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, 2 నుంచి 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్టు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలో లోపు నమోదైనట్టు పేర్కొంది. జైనద్, భీంపూర్ […]Read More
తెలంగాణ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులందరికీ ఒక విధమైన ఆహారం అందించాలన్న సంకల్పంలో చేపట్టిన కామన్ డైట్ మెనూ నేటి నుంచి ప్రారంభమైంది. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెనూ డైట్ కార్యక్రమం జరగ్గా, చిలుకూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అక్కడ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ స్కూల్ నుంచి ప్రతిభ కనబరిచి ఐఐటీ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు. 2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ […]Read More