సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ నాయకత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు. గత కొంతకాలంగా చేవెళ్ల నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాలో తనపట్ల, తన క్యాడర్, అభిమానుల పట్ల పార్టీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఈ విషయం గురించి చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావును కలిసి పరిస్థితిపై వివరించారు . ఆయన పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి […]Read More
Tags :singidinews
విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలన్నీ తొలగాలి – ఎమ్మెల్యే గండ్ర
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని, విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎలాంటి విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించారు. ప్రతి ఇంటిలో మట్టి […]Read More
జాతీయ క్రీడా దినోత్సవం – సైక్లింగ్ ర్యాలీకి ముఖ్య అతిథిగా గవర్నర్
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 31వ తేదీ, ఆదివారం నిర్వహించబడుతున్న సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవిలు ఈ రోజు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. “ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్” కార్యక్రమం భాగంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు […]Read More
ఖైరతాబాద్ గణేషుడ్ని దర్శించుకోవడానికి వెళ్తున్నారా..?
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రతి ఏడాది వినూత్నంగా దర్శనమిచ్చే గణేషుడు ఈ ఏడాది ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనమి వ్వనున్నారు.ఈ రోజు ఉదయం 6 గంటలకు తొలి పూజ, 10 గంటలకు కలశపూజ, ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది. ఈ కార్య క్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు. అనంతరం 69 అడుగుల ఎత్తైన విఘ్నేశ్వరుడి […]Read More
తెలంగాణలో గత రెండు ఏండ్లుగా ఖాళీగా ఉన్న గ్రామ పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అందులో భాగంగా నిన్న మంగళవారం ఎన్నికల సంఘం పంచాయితీల్లో ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.అందులో భాగంగా వచ్చేనెల సెప్టెంబర్ రెండో తారీఖు నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈనెల ఆగస్టు 28న డ్రాఫ్ట్ రోల్స్ పబ్లికేషన్, 29న […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటు చోరీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మెడకు చుట్టుకోనుందా? ..అంటే అవుననే అనిపిస్తోంది. నిజానికి బీహార్‌లో ఈసారి కొంత కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉందని అక్కడి జనం టాక్. లోక్ సభ పక్షనేత , కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఏదో కిందామీదా పడి నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓట్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈరోజు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నరకు జరగనున్నది..ఈసారి విస్తరణలో ముగ్గురికి అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. వారిలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. ఇక అసెంబ్లీ ఉప శాసనసభాపతి (డిప్యూటీ స్పీకర్)గా రామచంద్రు నాయక్కు అవకాశం ఇచ్చారు.Read More
కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు :- మాజీ మంత్రి హరీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లు కూలిపోయాయి. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ” ఆరోపించిన సంగతి తెల్సిందే . సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కౌంటరిచ్చారు. తెలంగాణ భవన్ లో ఈరోజు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలవుతున్న ఇంతవరకూ పూర్తిస్థాయి క్యాబినెట్ లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక పన్నెండు మందితో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ జాతీయ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు ఆదివారం రాజ్ భవన్ లో మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీభవన్ లో గుసగుసలు విన్పిస్తోన్నాయి. ఆ ముగ్గురిలో ఎస్సీ సామాజికవర్గం నుండి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ సీజన్ -2025లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు పంజాబ్ సూపర్ కింగ్స్ బిగ్ షాకిచ్చింది. ఈరోజు సాయంత్రం ముంబైతో జరిగిన కీలక మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా ఛేదించింది. పంజాబ్ ఆటగాళ్లల్లో ప్రియాంశ్ ఆర్య 62, ఇంగ్లిస్ 73 చెలరేగడంతో ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్ […]Read More