వైసీపీకి గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య బుధవారం రాజీనామా చేశారు. ఈరోజు గుంటూరులో అనుచరులతో జరిగిన కిలారి రోశయ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పార్టీకి నష్టం చేసేవారికి మాత్రమే పార్టీలో ప్రమోషన్లు..గౌరవం మర్యాదలు ఇస్తున్నారు. పార్టీ పెద్దలు నన్ను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు […]Read More
Tags :singidi
ఈ నెల ఇరవై ఐదో తారీఖున అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే… ఎమ్మెల్సీ ల బృందం మేడిగడ్డ సందర్శనకు బయలు దేరివెళతాం.. ఇరవై ఆరు తారీఖున కన్నెపల్లి ప్రాజెక్టు ను సందర్సించి ప్రాజెక్తుల గురించి అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలపై నిజానిజాలను తెలంగాణ రైతంగానికి ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెబుతాము.. ప్రాజెక్టులపై లేనివి ఉన్నవి కల్లబోల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుంది అని మాజీ మంత్రి […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత ఏపీ అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తనకు ఎల్పీ నేత హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో పిటిషన్ ను వేశారు. ప్రతిపక్ష నేత హోదా తనకు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన..కల్సి విన్నవించిన కానీ స్పందించడం లేదు.. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించాలని కోరుతున్నట్లు ఆ పిటిషన్ లో జగన్ పేర్కోన్నారు.Read More
బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎమ్మెల్సీలు ఢుమ్మా కొట్టారు. రేపటి నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ దళపతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలకు వివరించారు. ఈ క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్,సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీలు చల్లా,గోరటి తదితరులు […]Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఆర్థిక అవకాశాలూ దొరుకుతాయని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలిపారు..Read More
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ,బిహార్లపై బడ్జెట్ 2024-25 నుంచి నిధుల వర్షం కురిసింది. ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనుంది. మరోవైపు బిహార్లో రోడ్ల అభివృద్ధికి రూ.26వేల కోట్ల సాయంతో పాటు ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయనుంది.Read More
మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దీనివల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. అలాగే మెడిసిన్, వైద్య పరికరాలను కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో మూడు రకాల క్యాన్సర్ నివారణ మందుల ధరలు తగ్గనున్నాయి. మరోవైపు బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6శాతానికి, ప్లాటినం 6.5% తగ్గించారు.Read More
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ బడ్జెట్ లో కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. *మందులు, వైద్య పరికరాలు * మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు * సోలార్ ప్యానెళ్లు * దిగుమతి చేసుకునే బంగారం, వెండి, * సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్ (చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు) ధరలు తగ్గే అవకాశం […]Read More
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల ముప్పై ఒకటో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈరోజు ఉదయం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సాయన్న కు నివాళులు అర్పించిన అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.. తదానంతరం జరిగిన బీఏసీ సమావేశంలో సభను ఎనిమిది రోజులు నడపాలని నిర్ణయించారు. ఎల్లుండి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టనున్నారు.Read More
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ వార్షిక బడ్జెట్ లో ఆదాయ పన్ను స్లాబ్స్ గురించి మాట్లాడారు.. అవి ఇలా ఉన్నాయి… రూ.0-3 లక్షలు- నిల్ రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలు- 5% రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు- 10% రూ.10 లక్షల నుంచి 12 లక్షలు- 15% రూ.12 లక్షల నుంచి 15 లక్షలు- 20% రూ.15 లక్షలకు పైగా- 30%Read More