తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నాము . గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాము . తెలంగాణ సాధనలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది . ఇంజనీరింగ్ పట్టాతో లక్ష మంది విద్యార్థులు ప్రతి ఏడాది బయటకు వస్తున్నారు. కానీ నైపుణ్యం లేక నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు “అని హైదరాబాద్ శివారులోని మీరాఖాన్ పేట్ లో స్కిల్స్ యూనివర్సిటీకి […]Read More
Tags :singidi
ఖమ్మం జిల్లాలో బైకును ఢీకొట్టిన లారీ సంఘటనలో ముగ్గురు అక్కడక్కడే ప్రాణాలు వదిలారు.. వివరాలకు వెళ్తే బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడక్కడే మృతి చెందారు.వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం గ్రామం వద్ద చోటు చేసుకుంది.Read More
ఢిల్లీ హైకోర్టులో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ కు చుక్కుదురైంది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పూజా వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టేసింది. పూజా వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. పూజాకు యూపీఎస్సీలో ఎవరైన సహాకరించారా..?. అనేది తేల్చాల్సి ఉంది. ఇప్పటికే పూజాను ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్ధు చేసింది యూపీఎస్సీ.Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమావేశమైన మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ,బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్-1 క్యాడర్ లో డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది క్యాబినెట్. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో కప్ గెలిచిన టీమిండియాలో మెయిన్ పాత్ర పోషించాడు మహ్మద్ సిరాజ్. గతంలో రెండు సార్లు చాంపియన్ గా నిలిచారు నిఖత్ జరీన. ఇంకా క్యాబినేట్ మీటింగ్ కొనసాగుతుంది.ఈ క్యాబినెట్ […]Read More
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును స్వాగతించి, తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఙతలు తెలియజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో స్వీట్లు తినిపించుకుని సంబురాలు జరుపుకొన్నారు. సీఎంను కలిసినవారిలో సీనియర్ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ , ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మందుల సామేల్ , కడియం శ్రీహరి, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య ఇతర ప్రజాప్రతినిధులు […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చిన నేపథ్యలో చర్చ కార్యక్రమం జరిగింది.ఈ చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఆదివాసీ బిడ్డ అయిన కోవ లక్ష్మీకి స్పీకర్ మైకు ఇవ్వలేదని మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” రిజర్వేషన్ల వర్గీకరణ గురించి సభలో చర్చ జరుగుతున్న క్రమంలో ఎన్నో పోరాటాలు ఉద్యమాలు […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” సభలో మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డిని చూసి వణికిపోతున్న ఈ లిల్లిఫుట్స్ గాళ్లకు కేసీఆర్ అవసరమా..?. పట్టుమని పది నిమిషాలు సబితక్కను తట్టుకోలేని వీళ్ళు కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటరా.?. దమ్ముంటే బీఆర్ఎస్ కు చెందిన మహిళ ఎమ్మెల్యేలకు సభలో మైకు ఇచ్చి చూడాలి […]Read More
ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఏపీలో ఉన్న బోగస్ ఫించన్లను ఏరివేస్తాము.. ఆగస్టు15 తారీఖు నుండి 100 అన్న క్యాంటిన్లను ప్రారంభిస్తాము.. గత ఐదేండ్లలో రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేశారు.. అన్ని అప్పులు చేసి ప్రజలకు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేయకుండా సొంత ఆస్తులను కూడబెట్టుకున్నారు. కానీ ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్న అప్పులు ఎన్ని ఉన్న సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తాము.. గత ఎన్నికల్లో ఇచ్చిన […]Read More
రేణు దేశాయ్ ఎవరికి పరిచయం అక్కర్లేని పేరు.. బద్రీ ,జాని మూవీలతో తెలుగు ప్రేక్షకులకే కాదు ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కు దగ్గరైన బక్కపలచు భామ.. ఇటీవల వీరిద్దరూ విడిపోయిన కానీ ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మ రేణు దేశాయ్.. అలాంటి రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ఒకానోక టైంలో ఎంగెజ్మెంట్ కూడా చేసుకున్నారు.. అయితే ఏమైందో ఏమో కానీ అది […]Read More