Tags :singidi news

Movies Slider Top News Of Today

నిర్మాతతో గొడవపడిన మృణల్ ఠాకూర్

కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణల్ ఠాకూర్ ఓ నిర్మాతతో గొడవపడినట్లు ఓ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.. మృణల్ మాట్లాడుతూ “నేను నటించిన ‘పూజా మేరీ జాన్’ చిత్ర నిర్మాతలతో గొడవ పడ్డాను . ఈ చిత్రానికి సంబందించిన కథ కోసం మరో నటిని ఎంచుకోవడమే ఇందుకు కారణమట. ‘ఈ మూవీలో పాత్ర నాకెంతో నచ్చింది. నా నిజ జీవితానికి ఈ కథతో దగ్గర సంబంధం ఉంది. ఇలాంటి […]Read More

Andhra Pradesh Slider

హ్యాట్సాఫ్ 2 పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అందరిచేత హ్యాట్సాఫ్ అన్పించుకున్నారు.. రాష్ట్రంలోని తన నియోజకవర్గమైన పిఠాపురంలో వృద్ధురాలైన చంద్రలేఖ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన తన ఆవేదనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన ఇంటిని ఆక్రమించుకోవాలని కొందరు యత్నిస్తున్నారని చంద్రలేఖ సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. దీనిపై డిప్యూటీ సీఎం ఆదేశాలతో కాకినాడ ఆర్డీవో స్వయంగా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. […]Read More

Slider Telangana

గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా  జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ అలోక్ ఆరాధే  పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, […]Read More

Slider Telangana

భట్టికి సబితా ఇంద్రారెడ్డి కౌంటర్

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అసెంబ్లీలో మాట్లాడుతూ “పార్టీ మారిన వారు ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీ కి వచ్చారు. పదేండ్లు పదవులను అనుభవించారు. అధికారంలో ఉన్నారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లారు అని “మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిను ఉద్దేశిస్తూ వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ దగ్గర మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకుని సభకు వచ్చారు అని భట్టి అన్న అన్నారు. […]Read More

Andhra Pradesh Slider

మాజీ మంత్రి రజని సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఖండిస్తూ ‘రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక లేనట్లేనా?’ అంటూ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..ఆరోగ్య శ్రీ పథకానికి ఆయుష్మాన్ భారత్ రీప్లేస్మెంట్ కాదు.. ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు తీసుకొచ్చిన పథకం అని స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి విడదల రజని స్పందిస్తూ”ఆరోగ్యశ్రీపై టీడీపీ ప్రభుత్వ విధానమేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిని కల్సిన 10మంది BRS ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ” నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు.. తీరా పార్టీలోకి చేరాక సబితక్క కేసీఆర్ మాయమాటలు నమ్మి పార్టీ మారారు. నాకు అక్క తోడుగా ఉండాలి కదా.. నేను సభలో అక్క అనే అన్నాను.. వేరే భాష ఏమి ప్రయోగించలేదు.. నేను ఎవరి పేర్లను ప్రస్తావించలేదు.. మరి వాళ్లకు ఉలుకు ఎందుకు.. ? సభలో మాజీ మంత్రి హారీష్ రావు కు […]Read More

Slider Telangana

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంటతడి

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి… మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ దగ్గర కంటతడి పెట్టారు. మీడియాతో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” సభలో పదే పదే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను మోసం చేశాను.. మోసం చేసి పార్టీ మారాను.. నేను రేవంత్ రెడ్డిని మోసం చేసినట్లు చెప్పుకుంటున్నాడు.”. నేను ఏమి పదవుల కోసం మారలేదు. నన్ను బలవంతంగా పార్టీ మారేలా చేశారు. అక్క అక్క […]Read More

Slider Telangana

సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే కాలే యాదయ్య భేటీ

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లో చేరతారు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను నెలకొన్నది. కాంగ్రెస్ లో చేరిన గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. నిన్న మంగళవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే […]Read More

Slider Telangana Top News Of Today

గవర్నర్ కు సీఎం ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకమై తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేసిన జిష్ణుదేవ్‌ వర్మ కు హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారితో పాటు డీజీపీ జితేందర్‌ ఘన స్వాగతం పలికారు. అలాగే త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, ఇతర ఉన్నత అధికారులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు. అనంతరం గవర్నర్‌ సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ […]Read More