ఏపీలో గత ఐదారు నెలల నుండి పెండింగ్ లో ఉన్న ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో రేపటి నుండి (ఆగస్టు 15) రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. 2023 సెప్టెంబర్ నెల తర్వాత ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. రూ.2500కోట్లు రావాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.160కోట్లను విడుదల చేసింది. […]Read More
Tags :singidi news
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొదండ రామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను సిఫారస్ చేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళ సైకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెల్సిందే. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజ్ శ్రావణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. మా నియామకాన్ని కాదని కొదండరామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను ఎలా నియమిస్తారని […]Read More
కోల్ కత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యచారానికి నిరసనగా… బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర జూడాల సంఘం ఈరోజు బుధవారం ఓపీ సేవలను బంద్ పెట్టి నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే.. దీంతో జూడాలు ఈ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. జూడాల నిరసనలకు మంత్రి సీతక్క సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు తమ ప్రభుత్వం అండగా […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో పరిధిలోని నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్న మొన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ప్రత్యేక ధరలను పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.. అందులో భాగంగా టూ వీలర్ అయిన బైక్‌కు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10… 8 గంటల వరకు రూ.25.. 12 గంటల వరకు రూ.40గా […]Read More
2021 సెప్టెంబర్ 17 తారీఖున ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై అప్పటి మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇప్పటి మాజీ మంత్రి జోగి రమేష్,వల్లభనేని వంశీలతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. ముందస్తు బెయిల్ కోసం.. విచారణ నుండి మినహయింపు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పలువురు వైసీపీ నేతలకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి పదిరోజుల అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను ముగించుకొని ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఇతర ఉన్నతాధికారులతో బృందంతో కల్సి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనున్నరు.Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీ గురుకులాల్లో ఈరోజు ఉదయం నుండి ఏసీబీ దాడులు నిర్వహించిన సంగతి తెల్సిందే..ఈ రోజు ఉదయం నుండి వసతి గృహాల్లో నిర్వహించిన దాడుల్లో విద్యార్థుల వసతి గృహాల్లో తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు గుర్తించారు.. అంతేకాకుండా పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్యపై ఆరా తీయడం జరిగింది.. హాస్టల్స్‌లో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఇదే కేసులో పదిహేడు నెలల కిందట అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి విధితమే. నిన్న సోమవారం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను విచారించకుండా వాయిదా వేసిన […]Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఈ నెల 21న బీజేపీ వర్క్ షాప్ కార్యక్రమం జరగనున్నది.ఈ వర్క్ షాప్ లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం గురించి సుధీర్ఘ సమావేశం జరగనున్నది. ఈ వర్క్ షాప్ కు బీజేపీ పదాధికారులు,రాష్ట్ర,జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు,అధ్యక్షులు తదితరులు పాల్గోనున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా బీజేపీ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యాబై […]Read More
తెలంగాణ వ్యాప్తంగా రేపు బుధవారం ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్ కత్తా లో జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలి.. వారి కుటుంబానికి అండగా నిలబడాలని డిమాండ్ చేస్తూన్నారు జూడాలు.. జరిగిన సంఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు జూడాలు. దీంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.Read More
