ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ అధికార టీడీపీ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చింది. ట్విట్టర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని ఆ పార్టీ ట్వీట్ చేసింది. అప్పట్లో ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రి… […]Read More
Tags :Pawan Kalyan
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు జరిగిన మంత్రువర్గ సమావేశం సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సహచర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తాను సీఎంగా ఉన్నప్పటి ఐదెండ్ల పరిస్థితి గురించి వివరించారు.. అంతే కాకుండా ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన సవివరంగా వివరించారు. […]Read More
ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు. అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.Read More
ఏపీ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు. విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతుండడం ఇది రెండోసారి.Read More
సహజంగా ఎవరైన ఉన్నత స్థాయికెదగాలంటే..ఏదైన సాధించాలంటే అందరూ కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. ఏపీలో అధికార వైసీపీ పార్టీని నేలకు దించడమే కాదు ఏకంగా ఏపీ చరిత్రలోనే తిరుగులేని మెజార్టీని కూటమికి అందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో అప్పటి అధికార వైసీపీ కు చెందిన సీఎం జగన్ […]Read More
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం 164స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెల్సిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా..జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా…ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు నాయకత్వం ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తూ, కొలువుతీరనున్న బాబు టీమ్ .. క్యాబినెట్ ఇదే..! ChandrababuNaiduAneNenu KutamiTsunami AndhraPradeshRead More
జనసేన అధినేత..ప్రముఖ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది బైకర్లు తమ వాహనాలపై ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.Read More
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీ సార్వత్రిక మరియు లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.Read More
తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడు తారీఖున జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థులను ఆ పార్టీ దళపతి… మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో ఆయా లోక్ సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు,నేతలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఓ ఎంపీ అభ్యర్థి ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా కడియం కావ్య […]Read More