Tags :nda cabinate

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీ అభివృద్ధికి అండగా ఉంటా

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన పదహారు మంది ఎంపీలు నిన్న బుధవారం ప్రధాన మంత్రి నరేందర్ మోడీ ని కలిశారు. ఈ భేటీ గురించి ప్రధాన మంత్రి మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఏపీ ‘టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం’ అని అయన […]Read More

National Slider Top News Of Today

లోక్ సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240స్థానాలతో అతి పెద్ద పార్టీ గా అవతరించగా 99స్థానాలతో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ తమ కూటమి పార్టీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లోక్ సభ లో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని నియమించాలని తీర్మానం తీసుకున్నారు. దాదాపు పడేండ్ల తరువాత లోక్ సభలో విపక్ష నేత ఎన్నికవడం గమనార్హం.Read More

Andhra Pradesh Slider

బాబు టీమ్ ఇదే

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి మొత్తం 164స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెల్సిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా..జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా…ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు నాయకత్వం ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తూ, కొలువుతీరనున్న బాబు టీమ్ .. క్యాబినెట్ ఇదే..! ChandrababuNaiduAneNenu KutamiTsunami AndhraPradeshRead More

Andhra Pradesh Slider Videos

కేంద్రమంత్రిగా బీజేపీ వర్మ ప్రమాణ స్వీకారం

ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More

National Slider Videos

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

భారత ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు..ప్రధానమంత్రి నరేందర్ మోదీతో పాటు 72మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30మందికి కేబినెట్ హోదా.. 5గురుకి సహాయక కేంద్ర మంత్రులు(స్వతంత్ర హోదా)..36మందికి సహాయక మంత్రులు ఉన్నారు. వీరిలో 43మందికి మూడు సార్లు మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది.ఇరవై ఆరు మందికి ఆయా రాష్ట్రాల మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.Read More

National Slider Telangana

ఈటలకు బంఫర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ […]Read More