ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. మాజీ మంత్రి జోగి […]Read More
Tags :nara lokesh
ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేనానికి పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు నారా లోకేష్ కు రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..Read More
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో ఐదు పైల్స్ పై సంతకాలు చేశారు. అయితే సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఉన్నతాధికారులకు షాకిచ్చారు చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి కమీటీలు వేసిన జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ పార్టీ శ్రేణుల […]Read More
ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు. అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.Read More
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన మంత్రివర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత గౌరవం తగ్గకుండా మరెవరికీ డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వటం లేదని సమాచారం. జనసేనాని ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు. మరోవైపు అటు టీడీపీకి […]Read More
ఇది నిజంగా తెలుగు తమ్ముళ్లు తమ కాలర్ ఎగరేసుకునే వార్త. సహజంగా సీఎం స్థాయి వ్యక్తి అందరిలో ప్రత్యేకంగా కన్పించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా టీడీపీ అధినేత.. రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జరుగుతున్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ ఛైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. ఇదే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ […]Read More
ఏపీ రాజధాని గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.NDA శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని అయన స్పష్టం చేశారు. మరోవైపు ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాము . ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి […]Read More
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో 11ఎమ్మెల్యే..4ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణం అని ఆ పార్టీ నేత .మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వాపోయారు. ఆ చట్టంపై టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారని చెప్పారు. ‘ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని […]Read More
ఈరోజు విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలను నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More