ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More
Tags :modi
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా రెండో సారి గెలుపొందిన గంగాపురం కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.Read More
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ శుభాకాంక్షలు
తెలంగాణ నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు గంగపురం కిషన్ రెడ్డి గారు (సికింద్రాబాద్, MP) కేంద్ర మంత్రి, మరియు బండి సంజయ్ కుమార్ గారు (కరీంనగర్,MP) కేంద్ర సహాయమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా […]Read More
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి,కరీంనగర్ నుండి బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా వీరిద్దరికి కేంద్ర క్యాబినెట్ లో బెర్తు దొరికింది. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా పీఎంఓ కార్యాలయం నుండి వీరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో వీరిద్దరూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నివాసంకు బయలుదేరి వెళ్లారు.మరోవైపు ఏపీ నుండి టీడీపీకి ఇద్దరు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..Read More
ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీకి సొంతంగా మెజార్టీ సీట్లు గెలవకపోవడంతో జేడీయూ పార్టీ కీలకంగా మారింది. మొత్తం12 మంది ఎంపీ సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ స్థానంలో నిలిచింది. అయితే ఇవాళ ఎన్డీఏ పక్షాల భేటీలో బిహార్ సీఎం, జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను మొక్కబోయారు. మోదీ వెంటనే అడ్డుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టుజూన్ 21 వరకు కస్టడీ పొడిగించింది. అయితే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టుజైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని ఎమ్మెల్సీ కవిత కోరడంతో పుస్తకాలు ఇచ్చేందుకు అంగీకరించింది కోర్టు.Read More
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్, చంద్రబాబు, కుమారస్వామి, అజిత్ పవార్ మరియు ఇతర కూటమి నేతలు పాల్గోన్నారు.Read More
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటి కాదని సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో […]Read More
తెలంగాణలో ఉన్న మొత్తం 17లోక్ సభ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఎన్నికల ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్,ఆదిలాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుందిన్Read More
ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 542స్థానాల్లో బీజేపీ కూటమి 101,ఇండియా కూటమి 42,ఇతరులు11 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.Read More