ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేందర్ మోడితో ఈరోజు భేటీ కానున్నారు.. ఈభేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘాంగా చర్చించనున్నారు.. ఇటీవల బడ్జెట్ లో కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరనున్నారు.. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు…పెండింగ్ హామీలను నెరవేర్చాలని కోరనున్నట్లు తెలుస్తుంది..Read More
Tags :modi cabinate
ఈరోజు నుండి మొదలైన లోక్ సభ బడ్జెట్ సమావేశాలు దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా సాగాలి.. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నాము .. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము .. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది.. బడ్జెట్ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు.. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి.. ఈ ఐదేళ్లు […]Read More
పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్ సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ వ్యాఖ్యానించారు. సభలోని సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతాము..దేశంలోని ప్రజలందరీ ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని ఆయన కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ.. అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మోదీ పేర్కోన్నారు.Read More
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సిన కేంద్ర సహాయక శాఖ మంత్రి భూపతిరాజు
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయక మంత్రిగా నిన్న మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ. అనంతరం తనపై ఇంతటి నమ్మకాన్ని ఉంచి అవకాశమిచ్చిన ప్రధాన మంత్రి నరేందర్ మోదీ,కేంద్ర హోం మంత్రి అమిత్ షా,పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను తన కుటుంబంతో సహా కలిశారు …కేంద్ర సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో కొలువు దీరిన 72మంది కేంద్రమంత్రులకు ఆయా శాఖలు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా నితిన్ గడ్కరికి గతంలో కేటాయించిన రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా పని చేసిన మరోసారి అదే శాఖను కేటాయించారు. సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ టమ్లా ఉండనున్నారు.మరోవైపు అమిత్ షాకి కేంద్ర హోం శాఖ బాధ్యతలు..జైశంకర్ కు విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిత్వ బాధ్యతను..రాజ్ నాథ్ కు రక్షణ శాఖను కేటాయించారు.Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో 72మందితో కొలువుదీరిన మంత్రివర్గం ఈ రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకి సమావేశం అయిన సంగతి తెల్సిందే. ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదల పైల్ పై చేశారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో దేశంలో అర్హులైన పేదలకు ఇండ్లను నిర్మించాలనే తొలి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు మూడు కోట్ల ఇండ్లను పీఎం అవాస్ యోజన పథకం కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో […]Read More
ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More
కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా రెండో సారి గెలుపొందిన గంగాపురం కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.Read More