అదేంటీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ను ఫాలో అవ్వడం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ పరిధిలోని ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. ఈ ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బరిలోకి దిగడం లేదని ప్రకటించింది. కాంగ్రెస్ కు హైదరాబాద్ లో తగినంత బలం లేదని పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అదే […]Read More
Tags :mlc elections
తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 14 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో పదేండ్ల వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో […]Read More
త్వరలో కాంగ్రెస్ కు షాక్ ట్రీట్మెంట్-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి & టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య కి మద్దతుగా ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగింది. మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఇంకా అప్పుల పాలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. […]Read More
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోటి చేయడంలేదన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ పోటి చేయకపోవడంపై బీజేపీ నేతలు మాట్లాడుతూ ” కాంగ్రెస్ కు సపోర్టుగా ఉండటం కోసమే చేయడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీకి మద్ధతుగా బీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టడం లేదని ఆరోపిస్తుంది కాంగ్రెస్. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నాయకులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ […]Read More
ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కూటమికి చెందిన టీడీపీ జనసేన తరపున బరిలోకి దిగడానికి అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది.. టీడీపీ తరపున సీ రామచంద్రయ్య,జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ పేర్లను ఖరారు చేశారు.. రేపు వీరిద్దరూ నామినేషన్ దాఖలు చేయనున్నారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164ఎమ్మెల్యే స్థానాలను..వైసీపీ పదకొండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే.. టీడీపీ పదహారు ..జనసేన రెండు..బీజేపీ మూడు.. వైసీపీ నాలుగు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ 108ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. దీంతో ఈరోజు సాయంత్రం ఆయన మాజీ మంత్రి హారీష్ రావును కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల రోజున మహబూబ్ నగర్ ప్రజలు నవీన్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి బహుమతిగా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి […]Read More
నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. తెలంగాణ విజయ పతాక […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్‌ఎస్-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More
తెలంగాణలో ఈనెల 27న జరగనున్న నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ సమాజం, మేధావులు ఆలోచించి ఓటు వేయాలని,చట్టసభల్లో నిజాయితీతో కూడిన తెలంగాణ గళం వినిపించాలంటే.. ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డ, బిట్స్ పిలానీలో చదివిన విద్యాధికుడైన ఏనుగుల రాకేశ్ రెడ్డి కె మొదటి ప్రాధాన్యత ఓటువేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య […]Read More
ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబద్రుల ఉప ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బ్యాలెట్ పేపర్ లోని మూడో నెంబర్ క్రమ సంఖ్యలో మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు తెలిపారు. గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రున్ని కలుసుకొని ఓట్లను అభ్యర్థించాలని, బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని […]Read More