Tags :mla quota mlc elections
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అంటే ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భావించిన పార్టీ . దాదాపు పద్నాలుగేండ్ల పాటు అనేక ఉద్యమ పోరాటాలు చేసి అరవై ఏండ్ల నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. నెరవేర్చడమే కాకుండా రాష్ట్రమేర్పడిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి పదేండ్లలోనే యావత్ దేశమంతా తెలంగాణవైపు చూసేలా తీర్చిదిద్దిన పార్టీ. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ […]Read More
ఈనెలలో ఎమ్మెల్యేకోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది.. ఇందుకుగానూ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతిలను ఖరారు చేసింది.. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి ఇచ్చిన కాంగ్రెస్.. ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్.. ఊహించని విధంగా తెరపైకి విజయశాంతి పేరు రావడం విశేషం.Read More
తెలంగాణ మండలిలో ఈనెలలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తున్నది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు మంతనాలు జరిపారు. రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో సమావేశమై చర్చించారు.. ఈరోజు హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నరు మీనాక్షి నటరాజన్.. ఎమ్మెల్సీ […]Read More
తెలంగాణలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలపై ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్, అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇందు లో కాంగ్రెస్కి నాలుగు, బీఆర్ఎస్కి ఒకటి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ లో సామాజిక వర్గాల వారీగా ఈ ఎమ్మెల్సీ పోస్టులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతలైన వేం నరేందర్రెడ్డి, కుమార్ రావు, జీవన్ రెడ్డి, […]Read More
హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) గతంలో జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారైంది.ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయాలే ఎదురవు తున్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత ,తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పనిఖతం అవుడతుంది. అందుకు సంబందించి కొన్ని ఉదాహరణలు చూద్దాం.. ఎంపీ ఎన్నికలలో మహబూబ్‌నగర్, మల్కాజిగిరిలో బాధ్యత తీసుకుంటే అక్కడ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ […]Read More
బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ భేటీలో త్వరలో నిర్వహించనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, రజతోత్సవ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని బరిలోకి దింపాలనే అంశంపైనా కేసీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తారని తెలుస్తోంది.Read More
ఈ నెలలో ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ తరపున జనసేన నేత.. ప్రముఖ నటుడు నాగబాబు పేరును ఖరారు చేసింది. కూటమి పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన పార్టీ ప్రకటించింది. నిన్నటి వరకూ నాగబాబును పెద్దల సభ రాజ్యసభకు పంపాలని చూసిన కూటమి పార్టీ తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం విశేషం.Read More